70 ఏళ్ల తర్వాత కూడా అంటే సిగ్గు పడాలి: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-10-29T00:28:11+05:30 IST

రైతు ఆత్మహత్యల గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయింది. అయినా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది మనందరికి సిగ్గు చేటు. రైతులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని నేను హామీ ఇస్తున్నాను..

70 ఏళ్ల తర్వాత కూడా అంటే సిగ్గు పడాలి: కేజ్రీవాల్

చండీగఢ్: స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా కూడా దేశంలోని రైతులు ఇంకా ఆత్మహత్య చేసుకోవడం సిగ్గు చేటని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పంజాబ్‌లో రైతుల మరణాలు లేకుండా చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.


‘‘రైతు ఆత్మహత్యల గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయింది. అయినా రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇది మనందరికి సిగ్గు చేటు. రైతులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఏప్రిల్ 1 తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని నేను హామీ ఇస్తున్నాను. మేం దీని కోసం ఐదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. పంజాబ్‌లో వ్యవసాయం గురించి మేం చాలా పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేశాం. మరో నెల రోజుల్లో నేను పంజాబ్‌కు మరోసారి వస్తాను. అప్పుడు మా ప్రణాళికను మీకు వివరిస్తాను’’ అని పంజాబ్ రైతులతో కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-10-29T00:28:11+05:30 IST