రైతు సంఘాలే కంపెనీలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2021-04-18T06:12:08+05:30 IST

గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల పంటలు పండించే రైతు సంఘాలే కంపెనీలు ఏర్పాటుచేసే స్థాయికి అభివృద్ధి చెందాలని అనం తపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శీటీ అటల్‌ ఇంకుబేషన సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శివకిరణ్‌ పేర్కొన్నారు.

రైతు సంఘాలే కంపెనీలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలి
తమలపాకు తోటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త





 శాస్త్రవేత్త డాక్టర్‌ శివకిరణ్‌

 తనకల్లు,  ఏప్రిల్‌ 17: గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల పంటలు పండించే రైతు సంఘాలే కంపెనీలు ఏర్పాటుచేసే స్థాయికి అభివృద్ధి చెందాలని అనం తపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శీటీ అటల్‌ ఇంకుబేషన సెంటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శివకిరణ్‌ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని దిగువ చెక్కవారిపల్లి గ్రామంలో నాబర్డు సహకారంతో ఏర్పాటుచేసిన తమలపాకు రైతు ఉత్పత్తిదారుల  కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు కాలంలో ఉద్యోగాలు దొరకడం కష్టసాధ్యమని, అందువల్ల గ్రామీణ ప్రాం తాల్లోని యువకులు రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో కలసి కంపెనీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అందుకు కావలసిన సహాయ సహకరాలతో పాటు సాంకేతికతను కూడా అటల్‌ ఇంకుబేషన సెంటర్‌ అందిస్తుందని తెలిపారు. జిల్లాలోని తమలపా కుల సాగు అరుదైన పంటగా పేర్కొన్నారు. తమలపాకుల ద్వారా ఉత్పత్తిచేసే వివిధ రకాల ఉత్పత్తుల గురించి తెలిపారు. ప్రత్యేకించి ఆహార పదార్థాలలోను, ఔషధాల్లో, సువాసనలు వెదజల్లే నూనెల్లో మిశ్రమంగా తమలపాకు నూనెలు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రైతు లందరూ తాము పండించినపంట ఉమ్మడిగా అమ్ముకోవడం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని తెలిపారు. దిగువ చెక్కవా రిపల్లిలో సంవత్సరానికి 200 టన్నుల తమలపాకులను రైతులు పండిస్తున్నట్లు అంచనా వేశారు. ఈపంట సాగులో రైతులు పడుతున్న కష్టాలను, నష్టాలను తెలుసుకొని వాటిని నివారణకు వివిధ కంపెనీలతో తమల పాకు రైతు ఉత్పత్తి రైతు సంఘాలను సమన్వయం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమలపాకు సంఘం సభ్యులు కిష్టప్ప, పెద్దన్న, శ్రీనివా సులు లక్ష్మీ, పెద్దక్క, పలువురు సభ్యులు, సర్పంచ నాగరాజు, జనజాగృతి ప్రతినిధి రమణానాయక్‌, బాలజి, స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధి బబ్లూ పలువురు యువకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:12:08+05:30 IST