హంద్రీనీవా కాలువ గండి పూడ్చిన రైతులు

ABN , First Publish Date - 2021-12-05T05:25:46+05:30 IST

మండలంలోని మాడికవాండ్లపల్లి సమీపంలో 14 వ ప్యాకేజీలో పోతున్న హంద్రీనీవా కాలువకు పడిన గండిని శనివారం రైతులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు.

హంద్రీనీవా కాలువ గండి పూడ్చిన రైతులు

తలుపుల , డిసెంబరు 4 : మండలంలోని మాడికవాండ్లపల్లి సమీపంలో 14 వ ప్యాకేజీలో పోతున్న హంద్రీనీవా కాలువకు పడిన గండిని శనివారం రైతులు స్వచ్ఛందంగా మరమ్మతులు చేపట్టారు. కాలువ కట్టపై వరదనీరు ప్రవహిం చి కోతకు గురైంది. పలుసార్లు అధికారులకు తె లిపినా పట్టించుకోలేదని, దీంతో కాలు వగండిని స్వచ్ఛందంగా పూడ్చినట్లు రైతులు రా జగోపాల్‌ రెడ్డి, రఘునాథరెడ్డి, రా జారెడ్డి, శ్రీనాథ్‌, రఘునా థరెడ్డి, హరి, శ్రీనివాసులు, రమణ తెలిపారు. 


Updated Date - 2021-12-05T05:25:46+05:30 IST