‘కేసీఆర్‌ పాలనలో రైతులు ఆగమాగం’

ABN , First Publish Date - 2022-05-29T06:10:10+05:30 IST

‘కేసీఆర్‌ పాలనలో రైతులు ఆగమాగం’

‘కేసీఆర్‌ పాలనలో రైతులు ఆగమాగం’
మాట్లాడుతున్న వీర్లపల్లి శంకర్‌


కేశంపేట, మే 28: రాష్ట్రంలోని రైతులు కేసీఆర్‌ పాలనలో అధోగతి పాలయ్యారని కాంగ్రెస్‌ పార్టీ షాద్‌నగర్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేశంపేట మండలం కొనాయపల్లి, కాకునూర్‌ గ్రామంలో కాంగ్రె్‌సపార్టీ ఆధ్యర్యంలో రైతురచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. పేదలకు కాంగ్రెస్‌ పట్టాలు పంచితే కేసీఆర్‌ ప్రభుత్వం భూములను గుంజుకుంటుందని ఆరోపించారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని  ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాయని  అన్నారు. ప్రజలు రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో   కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు సత్తయ్య, వై.యాదయ్య యాదవ్‌, గూడ వీరేష్‌, జగదీశ్వరప్ప, కోడూరు రాములు, కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, శ్రీశైలం, రమేష్‌, భాస్కర్‌గౌడ్‌, గిరిధర్‌ యాదవ్‌, రావుల పెంటయ్య ఇబ్రహీం, రాజేందర్‌, లింగారెడ్డి, శేఖర్‌, పురుషోత్తం రెడ్డి, దయాకర్‌రెడ్డి, గాలిగుడెం మహేందర్‌, విక్రమ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:10:10+05:30 IST