మోర్తాడ్‌లో రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-02-27T01:42:56+05:30 IST

ఒప్పందం మేరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు

మోర్తాడ్‌లో రైతుల ఆందోళన

 నిజామాబాద్‌: ఒప్పందం మేరకు పంటను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఈ సంఘటన మోర్తాడ్ మండలంలో జరిగింది. మండలంలోని షేట్‌పల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది రైతులతో ఓ సీడ్ కంపెనీ పంటలు వేయించింది. పంటలను పండించిన తరువాత కంపెనీనే కొనేగోలు చేసే విధంగా రైతులతో సీడ్ కంపెనీ బై బ్యాక్ ఒప్పందం చేసుకుంది. అయితే పంటలు పండించిన తరువాత మార్కెట్‌ ధరకు పంటలను కొనుగోలు చేయలేమని కంపెనీ చేతులెత్తేసింది. దీంతో తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని తమకు విత్తనాలు ఇచ్చిన యజమాని ఇంటి ఎదుట రైతులు ధర్నా చేశారు. 

Updated Date - 2021-02-27T01:42:56+05:30 IST