Advertisement

అన్నదాత అవస్థలు

Oct 27 2020 @ 05:41AM

బషీరాబాద్‌: విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు అన్నదాత పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఎంతో కొంత పంట చేతికి వచ్చినా.. దాన్ని అమ్ముకోవడానికి రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పత్తి పంట నీట మునిగి పాడైపోయింది. పొలాల్లో అరకొరగా మిగిలి ఉన్న పత్తిని తీసిన రైతులు ఇళ్ల వాకిళ్లలో దాన్ని ఆరబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పత్తి కొనుగోళ్లను అధికారులు ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

Follow Us on:
Advertisement