రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-08-08T10:12:33+05:30 IST

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యే యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అ న్నారు.

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 

సాగర్‌ ఎడమ కాల్వకు నీటి విడుదల


నాగార్జునసాగర్‌, ఆగస్టు7: రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యే యంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. సాగర్‌ ప్రాజెక్టు వద్ద స్విచ్చాన్‌ చేసి ఎడమ కాల్వకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. తొలుత పొట్టిచెలమ హెడ్‌రెగ్యులేటరీ వద్ద పూజలు నిర్వహించి అనంతరం స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కృష్ణా బేసిన్‌లో ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా సాగర్‌ ఎగువ ప్రాజెక్టులు నిండుతున్నాయన్నారు. సాగర్‌కు శ్రీశైలం నుంచి వరద వస్తుండగా, సీఎం ఆదేశాల మేరకు వారబంధీ ప్రకారం నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు సీఈ నర్సింహ మాట్లాడుతూ, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎడమ కాల్వ పరిధిలో సాగవుతున్న 6.50లక్షల ఎకరాలకు నీటి విడుదల షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.


గత ఏడాది ఆగస్టు 11న వానాకాలం పంటలకు నీటి విడుదల చేయగా, ఈ ఏడాది నాలుగు రోజులు ముందుగా నీరిచ్చామన్నారు. గత ఏడాది వానాకాలం సాగుకు 45 టీఎంసీలు, యాసంగికి 50 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది వానాకాలం పంటలకు 45 టీఎంసీల నీటిని నవంబరు మాసం చివరి వరకు విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ మధుసూదన్‌రావు, ఖమ్మం ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ వెంకటేశ్వరరావు, ఈఈలు సాల్మన్‌రాజు, పరమేష్‌, యలమంద, ఏఈలు కృష్ణయ్య, జనార్దన్‌, రామారావు, రైతు సమన్వయసమితి జిల్లా చైర్మన్‌ రాంచందర్‌నాయక్‌, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌డ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు యడవెల్లి విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


557 అడుగులకు చేరిన సాగర్‌ నీటి మట్టం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 557.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 38140 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 557.10 అడుగుల(225.6929 టీఎంసీలుగా) నీటిమట్టం ఉంది. సాగర్‌ నుంచి ఎడమ కాల్వ ద్వారా 1390 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2200, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 25984 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 29562 క్యూసెక్కుల నీర విడుదలవుతోంది. గత ఏడాది ఇదే రోజున సాగర్‌ నీటిమట్టం 510.60 అడుగులుగా (132.6919 టీఎంసీలు)గా ఉంది.

Updated Date - 2020-08-08T10:12:33+05:30 IST