రైతులు ఆందోళన చెందొద్దు

ABN , First Publish Date - 2021-04-24T04:49:29+05:30 IST

రైతులు ఆందోళన చెందొ ద్దని, పండించిన ప్రతీ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఎంపీపీ మేఘారెడ్డి అన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ మేఘారెడ్డి

- ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

- అకాల వర్షాలకు తడిసినా కొనుగోలు చేస్తాం

- వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీపీ మేఘారెడ్డి

పెద్దమందడి, ఏప్రిల్‌ 23: రైతులు ఆందోళన చెందొ ద్దని, పండించిన ప్రతీ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఎంపీపీ మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం బలిజపల్లి, వీరాయపల్లి, మంగంపల్లి,  అ ల్వాల, వెల్టూరు, చిలకటోని పల్లి గ్రామాలలో వరి కొ నుగోలు కేంద్రాలను ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు రాజప్రకాష్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ  మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు మ హిళా సమైఖ్య ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ప్రా రంభించినట్లు తెలిపారు. అకాల వర్షాలకు తడిసి ము దైన ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురా వాలని సూచించారు. కార్యక్రమంలో వెల్టూరు సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, జంగమాయపల్లి స ర్పంచ్‌ సతీ ష్‌, వ్య వసాయ అధికారి మల్లయ్య, ఏపీఎం రాజశేఖ ర్‌రెడ్డి, శ్రీశైలం, కాశీనాథ్‌, రాణి పాల్గొన్నారు.

ఆత్మకూరులో...

మండల పరిధిలోని రేచింతల గ్రామంలో వరి కొ నుగోలు కేంద్రాన్ని వైస్‌ఎంపీపీ కోటేశ్వర్‌, సింగిల్‌విండో  అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి, సర్పంచ్‌ మురళీధర్‌రావు  శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్ర యించాలని ఎంపీపీ కోరారు. కార్యక్రమంలో రేచింత ల సింగిల్‌విండో సీఈవో రవికుమార్‌, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:49:29+05:30 IST