తూకాల కోసం రైతుల నిరీక్షణ

ABN , First Publish Date - 2021-05-10T07:07:16+05:30 IST

మిల్లుల్లో హమాలీల సమస్యతో ధాన్యం లారీలను అన్‌లోడ్‌ చేయడానికి రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లుల్లో సకాలంలో అన్‌లోడ్‌ జరగనందున కొను గోలు కేంద్రాల్లో ధాన్యం లిఫ్టింగ్‌ సమస్య ఏర్పడింది. దీంతో తూకాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అన్‌లోడ్‌ ఆలస్యమైతే ధాన్యం తరుగును తామే భరించాల్సి వస్తుందని కేంద్రాల నిర్వహకులు వాపోతున్నారు. లిఫ్టింగ్‌లో జరుగుతు న్న జాప్యంతో ధాన్యం తూకాలు మందకొడిగా సాగుతుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తూకాల కోసం రైతుల నిరీక్షణ
చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని శ్రీ మల్లికార్జున రైస్‌ ఇండస్ట్రీస్‌ ఎదుట క్యూ కట్టిన లారీలు

ఫహమాలీల కొరతే కారణం

ధాన్యం లారీల అన్‌లోడ్‌కు రెండు, మూడు రోజుల సమయం 

చౌటుప్పల్‌ టౌన్‌, మే 9: మిల్లుల్లో హమాలీల సమస్యతో ధాన్యం లారీలను  అన్‌లోడ్‌ చేయడానికి  రెండు, మూడు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిల్లుల్లో సకాలంలో అన్‌లోడ్‌ జరగనందున  కొను గోలు కేంద్రాల్లో  ధాన్యం లిఫ్టింగ్‌ సమస్య ఏర్పడింది. దీంతో తూకాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా,  అన్‌లోడ్‌ ఆలస్యమైతే ధాన్యం తరుగును తామే భరించాల్సి వస్తుందని కేంద్రాల నిర్వహకులు వాపోతున్నారు. లిఫ్టింగ్‌లో జరుగుతు న్న జాప్యంతో ధాన్యం తూకాలు మందకొడిగా సాగుతుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కరోనా సమస్యతో..

కరోనా సమస్యతో పనిచేసే హమాలీల సంఖ్య రోజు రోజుకు తగ్గిపో తోంది. అందులోనూ రాత్రి పూట కర్ఫ్యూ కారణంగా రోజు వారి సమ యాల కంటే రెండు, మూడు గంటల ముందుగానే మిల్లుల నుంచి హమాలీలు ఇళ్లకు వెళుతున్నారు. మరోవైపు ఎండలకు తొందరగా హమా లీలు అలసిపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లోడ్లను దిగుమతి చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతోంది.

ఉదాహరణకు..

చౌటుప్పల్‌లోని శ్రీమల్లికార్జున రైస్‌ ఇండస్ట్రీస్‌కు రెండు లక్షల బస్తాల (80 వేల క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేయాలని ప్ర భుత్వం టార్గెట్‌ విధించింది. ఈ మిల్లుకు చౌటుప్పల్‌ మండ లంలోని ఏఎంసీ కొనుగోలు కేంద్రంతో పాటు పీఏసీఎస్‌ ఆధీ నంలోని ఎస్‌.లింగోటం, జైకేసారం, పంతంగిలోని ఐకేపీ కేంద్రా లను, సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని ఆరు పీఏసీ ఎస్‌ కొనుగోలు కేంద్రాలను కేటాయించారు. ఈ మిల్లులోని హమాలీల సంఖ్యను బట్టి రోజుకు 8 నుంచి 10 లారీల ధా న్యాన్ని అన్‌లోడ్‌ చేస్తుంటారు. ఈ పరిమితికి మించి రోజుకు 18 నుంచి 25 ధాన్యం లారీలు వస్తున్నాయి. దీంతో ధాన్యం లారీలను అన్‌లోడ్‌ కోసం రెండు, మూడు రోజులు మిల్లు ఎదుట క్యూలో పెటా ్టల్సివస్తోంది. మిల్లుల వద్ద అన్‌లోడ్‌కు ఆలస్యమవుతున్నందున కొనుగోలు కేంద్రాల్లో లిఫ్టింగ్‌ సమస్య ఏర్పడింది.

రైతుల నుంచి ప్రతిఘటన

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలకు అనుగుణంగా లిఫ్టింగ్‌ లేనం దున .తూకాల కోసం రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వ స్తోంది. పొలాలల్లో  నారు పోసిన ప్పటి నుంచి కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యాన్ని తూకాలు వేసేంత వరకు అనేక బాధలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొనుగోలు కేంద్రాల్లో లిఫ్టింగ్‌ సమ స్యతో ధాన్యం తూకాలను వేయలేకపోతున్నామని నిర్వాహకులు తెలి పారు.  లిఫ్టింగ్‌తోపాటు మిల్లుల వద్ద  అన్‌లోడ్‌లో  అలస్యం జరిగేకొద్దీ  ధాన్యంలో వచ్చే తరుగును తామే భరించాలివస్తోదని నిర్వాహకులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

ఎండలకు అలసిపోతున్న హమాలీలు

ఎండల తీవ్రతకు హమాలీలు తొందరగా అలసిపోతున్నారు. రోజుకు 8 నుంచి 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని కేంద్రాల్లో ఒక రోజు 1000 బస్తాలు, మరో రోజు 10 వేల బస్తాల ధాన్యాన్ని తూకాలు వేస్తున్నందున లిఫ్టింగ్‌ సమస్య ఏర్పడింది. ఇష్టారాజ్యంగా వేస్తున్న తూకాలతోనే లిప్టింగ్‌,  అన్‌లోడ్‌ సమ స్యలు తలెత్తాయి. కేటాయించిన మిల్లుల్లో జరుగుతున్న దిగు మతులను బట్టి ధాన్యం తూకాలు వేయడం అన్ని విధాలా శ్రేయ స్కరం.

 మంచికంటి భాస్కర్‌ గుప్త, శ్రీమల్లికార్జున మిల్లు యజమాని,     రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చౌటుప్పల్‌ 









Updated Date - 2021-05-10T07:07:16+05:30 IST