ధాన్యం కొనుగోలు చేయక రైతుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-05-28T05:02:59+05:30 IST

పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ రైస్‌మిల్లులో ధాన్యాన్ని నెలరోజుల నుంచి నిల్వ ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేయక రైతుల ఇక్కట్లు
ఆర్డీవో బాపిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రైతులు

ఆర్డీవో బాపిరెడ్డికి రైతుల వినతి

ఆత్మకూరు, మే 27 : పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ రైస్‌మిల్లులో ధాన్యాన్ని నెలరోజుల నుంచి నిల్వ ఉంచినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ఆర్డీవో టి. బాపిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ రోజుల నుంచి పలువురు సన్న చిన్నకారు రైతులకు చెందిన 500 బస్తాల ధాన్యాన్ని నిల్వ ఉంచినా కొనుగోలు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ధాన్యం సేకరణను నిలిపి వేయడంతో 50 మంది రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-28T05:02:59+05:30 IST