బలహీన ప్రతిపక్షం వల్లే రైతులు రోడ్లెక్కారు: తికాయిత్

ABN , First Publish Date - 2021-01-18T01:02:11+05:30 IST

ప్రతిపక్షాలు వారి పాత్ర వారు పోషించి ఉంటే రైతులు ఆందోళనలకు దిగాల్సి వచ్చేది కాదని ..

బలహీన ప్రతిపక్షం వల్లే రైతులు రోడ్లెక్కారు: తికాయిత్

నాగపూర్: ప్రతిపక్షాలు వారి పాత్ర వారు పోషించి ఉంటే రైతులు ఆందోళనలకు దిగాల్సి వచ్చేది కాదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేష్ తికాయిత్ అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో విపక్షం బలహీనంగా ఉందని, ఆ కారణంగానే రైతులు ఆందోళనకు వెళ్లక తప్పలేదని అన్నారు. రైతుల నిరసన సైద్ధాంతిక పిప్లవమని, అది ఎప్పటికీ విఫలం కాదని ధీమా వ్యక్తం చేశారు.


'సరిహద్దుల దగ్గర లక్షలాది మంది రైతులు బైఠాయించినప్పుడు ప్రభుత్వం ఎందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదు? ఆందోళన కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఆందోళన చేస్తున్న రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఇళ్లకు వెళ్లరు' అని అన్నారు. రైతు ఉద్యమంలో దేశంలోని 550కి పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-01-18T01:02:11+05:30 IST