లారీలు రాకపోవడంతో రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2021-05-07T05:38:45+05:30 IST

మండలంలోని మల్లాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు మూడు రోజుల నుంచి లారీలను అధికారులు పంపడం లేదు.

లారీలు రాకపోవడంతో రోడ్డెక్కిన రైతులు
రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్న రైతులు

ఎల్లారెడ్డి, మే 6: మండలంలోని మల్లాయిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు మూడు రోజుల నుంచి లారీలను అధికారులు పంపడం లేదు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం నిలువలు రోజురోజుకూ బారీగా పెరుగుతున్నాయ ని, తాళ్లపేరుతో రైస్‌మిల్లర్లు మోసం చేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. లారీలు సకాలంలో పంపేలా చూస్తామని అధికారులు వచ్చి హామీ ఇస్తేనే కదులుతామని బిష్మించుకొని కుర్చున్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్ధార్‌ స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సమస్యలను పరిష్కరిస్తానని, కొనుగోలు వేగవంతం అయ్యేలా చూస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

Updated Date - 2021-05-07T05:38:45+05:30 IST