ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ: రైతు

ABN , First Publish Date - 2021-01-17T20:27:07+05:30 IST

అయితే ట్రాక్టర్ ర్యాలీ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 65 వేల మంది పోలీసు బలగాలను నియమించనున్నట్లు ఢిల్లీకి చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో ఉన్న మొత్తం 87,000 మంది పోలీసు బలగాల్లో గణతంత్ర దినోత్సవ

ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ: రైతు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు వేలాది మంది పంజాబ్ రైతులు లుధియానా నుంచి ఢిల్లీకి కదిలారు. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న నిరవధిక నిరసనలో ఎక్కువ మంది పంజాబీ రైతులే. కాగా నిరసనలో ఉన్న వారికి తోడుగా పంజాబ్ నుంచి మరింత మంది రైతులు దేశ రాజధానికి కదిలారు.


ఈ విషయమై ఓ రైతు మాట్లాడుతూ ‘‘దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు బయలుదేరాం. మొత్తంగా లక్ష ట్రాక్టర్లు పంజాబ్ నుంచి ఢిల్లీకి బయల్దేరాయి. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. గణతంత్ర దినోతవ్సరం రోజున నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీతో ప్రభుత్వ ఆలోచన మారుతుందని అనుకుంటున్నాను’’ అని అన్నారు.


అయితే ట్రాక్టర్ ర్యాలీ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 65 వేల మంది పోలీసు బలగాలను నియమించనున్నట్లు ఢిల్లీకి చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో ఉన్న మొత్తం 87,000 మంది పోలీసు బలగాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వినియోగించే బలగాలు 75 శాతమని ఆయన పేర్కొన్నారు. రాజ్‌పథ్, ఇండియాగేట్ చుట్టూ పెద్ద ఎత్తున బారీకేడ్లు, చాలా ఎక్కువ సంఖ్యలో ఇంటర్‌సెక్షన్లు, చెక్‌పాయింట్లు, ఐరన్ బారీకేడింగ్ బార్డర్స్, స్నిఫ్ఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు (27 రోజులు) ఢిల్లీలో యూఏవీలు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్‌ బెలూన్లను ప్రదర్శించరాదని ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2021-01-17T20:27:07+05:30 IST