రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2022-05-28T04:33:55+05:30 IST

రైతులు వానాకాలంలో ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస సహ పరి శోధన సంచాలకులు డాక్టర్‌ ఉమాదేవి అన్నారు. శుక్రవారం శివలింగాపూర్‌ లో సాగు చేస్తున్న యాసంగి పత్తి సాగును పరిశీలించారు. ఆమె మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్న రైతుల పంటలను సందర్శించారు. సాగుకు సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సం చాలకులు జోనల్‌ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు

రైతులు  ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

చెన్నూరురూరల్‌, మే 27: రైతులు వానాకాలంలో ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస సహ పరి శోధన సంచాలకులు డాక్టర్‌ ఉమాదేవి అన్నారు. శుక్రవారం శివలింగాపూర్‌ లో సాగు చేస్తున్న యాసంగి పత్తి సాగును పరిశీలించారు. ఆమె మాట్లాడు తూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్న రైతుల పంటలను సందర్శించారు. సాగుకు సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సం చాలకులు జోనల్‌ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పత్తి సాగుపై పూర్తి సమాచారాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.   బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ రాజేశ్వర్‌నాయక్‌, ఏరువాక కేంద్రం ముధోల్‌ కోఆర్డినేటర్‌ వీరన్న, ఆదిలాబాద్‌ విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ ప్రవీ ణ్‌, వ్యవసాయ శాఖ పరిశోధన కేంద్రం ఆదిలాబాద్‌ సీనియర్‌ శాస్త్రవేత్త తిరుమలరావు, బెల్లంపల్లి శాస్త్రవేత్తలు శివకృష్న, నాగరాజు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాజేంద్ర ప్రసాద్‌, మండల ఏవో మహేందర్‌, ఏఈవో రాజశేఖర్‌, రైతులు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేటరూరల్‌: వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని పొలాస సహా పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఉమాదేవి రైతులకు సూచించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో జోనల్‌ స్ధాయి పరిశోధన శాస్త్రవేత్తల బృందం పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌, ఏఈవో ప్రసన్న, రైతులు తిరుమలరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T04:33:55+05:30 IST