పిన్నింటి పార్వతిని సత్కరిస్తున్న మున్నంగి విజయలక్ష్మి తదితరులు
వేపగుంట, మార్చి 1: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు రాజకీయాల్లో అధిక ప్రాఽధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర కాపు సంక్షేమ సేన అధ్యక్షురాలు మున్నంగి విజయలక్ష్మి అన్నారు. వేపగుంట ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో వేపగుంటకు చెందిన పిన్నింటి పార్వతిని పెందుర్తి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షురాలిగా నియమించే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులు రాజకీయాల్లో మరింత ఉన్నత స్థితికి ఎదిగేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎర్రా రేవతి, నాయకులు గుర్రాల శ్రీనివాసరావు, జి.శ్రీను, సునీల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.