Advertisement

రైతులు రెండో పంటకు సిద్ధం కావాలి : స్పీకర్‌ పోచారం

Oct 17 2020 @ 02:01AM

నిజాంసాగర్‌, అక్టోబరు 16: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున రైతులు రెండో పంట వేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి బహుళార్థక సాధక ప్రాజెక్టు నిజాంసాగర్‌ అని, ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును శుక్రవారం ఆయన సందర్శించారు. మంజీరా నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసి తెప్పెను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వరప్రదాయిని ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత నిండటం ఎంతో సంతోషమన్నారు. నిజాంసాగర్‌ నుంచి రెండు పంటలకు సరిపోయే విధంగా నీరు ఉందన్నారు. రైతులు రెండో పంటకు సిద్ధం కావాలన్నారు. రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు వదలడానికి సిద్ధమన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును నైజాం ప్రభుత్వం నిర్మిం చిదన్నారు.


నిజాంసాగర్‌ నుంచి అలీసాగర్‌ వరకు లక్షా 30వేల ఎకరాలు నిజా ంసాగర్‌ నుంచి నీరు అలీసాగర్‌, గుత్ప వరకు లక్ష ఎకరాలకు శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ద్వారా అలీసాగర్‌, గుత్పల ద్వారా లక్ష ఎకరాలకు నీరందిస్తామ న్నారు. ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు తాగునీటితో పాటు సాగునీరు అందించనున్నట్లు, సింగూరు ద్వారా అందనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అనుమతితోనే శ్రీరాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌తో డిస్ర్టిబ్యూటర్‌ నెంబర్‌ 38 వరకు అదనంగా ఎడపల్లి, మోస్రా, బోధ న్‌, అలీసాగర్‌ వరకు నీరందిస్తామన్నారు. నిజాంసాగర్‌ నీటితో బాన్సువాడ, వర్ని, కోటగిరి, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, నిజాంసాగర్‌ మండలాలకు పుష్కలం గా నీరందించనున్నట్లు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు నిండుకుండలా ఉంచేందుకు మల్లన్నసాగర్‌ నుంచి హల్దివాగు వరకు రూ.1500 కోట్ల వ్యయం తో కాల్వల నిర్మాణం కొసాగుతుందన్నారు.


ఏడాదిలోగా పూర్తయి, హల్దివాగు లోకి మల్లన్నసాగర్‌ ద్వారా నీరు వస్తుందన్నారు. కొండపోచమ్మ సాగర్‌ 17 టీఎంసీల సామర్థ్యం కలదన్నారు. కొండ పోచమ్మ ప్రాజెక్టు పూర్తి నీటి సామ ర్థ్యం 17 టీఎంసీలకు కాగా, 9 టీఎంసీల నీటి నిల్వలున్నాయని, నెల రోజుల్లోగా నిజాంసాగర్‌లోకి హల్దివాగు ద్వారా 15 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను అవసరాల మేరకే ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ ఆలస్యంగానైనా నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండటం ఇక్కడి రైతాం గం అదృష్టమన్నారు. త్వరలో జుక్కల్‌ నియోజకవర్గానికి 40వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫెదార్‌ శోభ, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజా గౌడ్‌, నీటి పారుదల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, అధికారులున్నారు.


రైతులు క్షేమంగా ఉంటేనే.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది

బాన్సువాడ: రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో వానాకాలం పంటల కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వానాకాలంలో రాష్ట్రంలోనే మొట్ట మొద టి సారిగా కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాం గం ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు దళారులు, ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు తమ ఉత్పత్తు లను అమ్ముకోవాలన్నారు. అనంతరం కలెక్టర్‌ శరత్‌ మాట్లాడుతూ వానాకాలం లో పంటలు కోతకు వస్తుండటంతో రైతులకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. ధాన్యం 17 శాతం తేమ ఉండేలా బాగా ఆరబెట్టిన అనంతరం తీసుకుని రావాలన్నారు. ఈ సమావేశంలో జుక్కల్‌ శాసన సభ్యుడు హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సహకార సంఘాల చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.  

Follow Us on:
Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.