లోగ్రేడ్‌పై రైతులకు ఊరట

ABN , First Publish Date - 2020-07-05T11:29:57+05:30 IST

లోగ్రేడ్‌ పొగాకుపై ఎట్టకేలకు వ్యాపా రులు దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం వరకు లోగ్రేడ్‌ల వైపు కన్నెత్తిచూడని పలు కంపెనీల

లోగ్రేడ్‌పై రైతులకు ఊరట

కదలిక తెచ్చిన మార్క్‌ఫెడ్‌

కొనుగోళ్లపై వ్యాపారుల దృష్టి

పలుకేంద్రాల్లో తగ్గిన నోబిడ్లు


ఒంగోలు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): లోగ్రేడ్‌ పొగాకుపై ఎట్టకేలకు వ్యాపా రులు దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం వరకు లోగ్రేడ్‌ల వైపు కన్నెత్తిచూడని పలు కంపెనీల బయ్యర్లు రెండు,మూడు రోజులుగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పొగాకు మార్కెట్లోకి వచ్చిన మార్క్‌ఫెడ్‌ లోగ్రేడ్‌ను కొనుగోలు చేస్తున్నది. ప్రధానంగా వ్యాపారులు ఇ ప్పటివరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన ఎఫ్‌-5,ఎఫ్‌-8 రకాలను కిలో రూ.85కు తగ్గకుండా కొనుగోలు చేస్తోంది. ఈక్రమంలో లోగ్రేడ్‌లపై వ్యాపా రుల లో కదలిక వచ్చి కొనుగోళ్లు చేస్తుండటంతో ఆయా కేంద్రాలలో నోబి డ్‌ బేళ్లు తగ్గుతున్నాయి. దీంతో రైతులకు కొంతమేర ఊరట పొందుతున్నారు.


ఈ సీజన్‌ పొగాకు మార్కెట్‌ ప్రారంభం నుంచి వ్యాపారుల పోకడ,  బోర్డు తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికంగా పం డిన లోగ్రేడును కొనేందుకు వ్యాపారులు ఆసక్తిని చూపలేదు. అలాగే మేలురకం, మీడియం గ్రేడ్‌లకు ఆశించిన ధరలు లభించలేదు. ఈక్రమం లో మీడియం, లోగ్రేడ్‌లపై ఆందోళన చెందుతున్న రైౖతులు వివిధ రూపా లలో ఇటు ప్రభుత్వం, అటు పొగాకు బోర్డుపై ఒత్తిడిని పెంచగా రాష్ట్ర ప్ర భుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వయంగా సమీక్ష ని ర్వహించి రైతులకు అండగా మార్కెట్‌లో దిగి కొనుగోళ్లు చేయాలని మా ర్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. రైతు ప్రతినిధులు, బోర్డు ప్రతినిధులతో విస్తృతం గా చర్చించిన అనంతరం మీడియం, లోగ్రేడులను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు నిర్ణయించారు. మీడియం గ్రేడ్‌లో కాస్తంత బా గున్న రకాన్ని కిలో రూ.140, కాస్త తక్కువ రకంగా ఉన్న దానిని రూ.130కి తగ్గకుండా కొనాలని నిర్ణయించారు. అలాగే, లోగ్రేడులలో కాస్తంత బాగుం డే ఎఫ్‌-4 రకాన్ని రూ.100, మీడియంగా ఉండే ఎఫ్‌-5, ఎఫ్‌-8 రకాలను కిలో రూ.85కు తగ్గకుండా కొనాలని నిర్ణయించారు. లోగ్రేడ్‌లో మరో రెండు రకాలైన ఎఫ్‌-9, ఎన్‌ఓజీ రకాల ధరలపై కొద్దిరోజుల అనంతరం నిర్ణయం తీసుకొని కొనాలని నిర్ణయించారు. 


1నుంచి మార్కెఫెడ్‌ కొనుగోళ్లు

ఈనెల 1నుంచి మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్లను ప్రారంభించింది. తొలుత ఒం గోలు-1లో చేపట్టగా అనంతరం ఒంగోలు-2, పొదిలి, కొండపిలలో కొం టున్నారు. మిగిలిన కేంద్రాలలోనూ కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.  తొ లుత ఎఫ్‌-5,ఎఫ్‌-8లను కొనడం ప్రారంభించిన మార్క్‌ఫెడ్‌ వారంలో మిగ తా రకాలను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. నాలుగు రోజుల నుంచి లోగ్రేడులను మార్‌్క్‌ఫెడ్‌ కొంటుండగా ఆ ప్రభావం మార్కె ట్‌పై కనిపిస్తున్నది. ఇప్పటివరకు లోగ్రేడుల జోలికిపోని పలు కంపెనీలు ప్రస్తుతం వాటిని కొనుగోలు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రోజువారీ కొనుగోలు వాటాలను గణనీయంగా పెంచి కొనుగోలు చేస్తున్నాయి.  


ఒంగోలు-2 కేంద్రంలో శుక్రవారం లోగ్రేడులను కొంతమేర తగ్గించి కొన గా మార్క్‌ఫెడ్‌ 25.27 శాతం కొనుగోలు చేసింది. అదే కేంద్రంలో శనివా రం ఆయా కంపెనీలు కొద్దిగా జోరుచూపగా మార్క్‌ఫెడ్‌ 11.48 శాతానికే పరిమితమైంది. ఒంగోలు-1లో రెండురోజులు 22 శాతానికి, కొండపిలో 28నుంచి 32 శాతం వరకు కొనుగోలు చేశారు.  దీంతో రోజువారీ నోబిడ్‌ బేళ్లు ప్రత్యేకించి లోగ్రేడ్‌ తిరస్కరణలు తగ్గడంతో రైతులు ఒకింత ఊరట చెందినట్లుగా కనిపిస్తున్నారు.

Updated Date - 2020-07-05T11:29:57+05:30 IST