పార్లమెంట్ సమావేశాల తర్వాత కూడా రైతు ఆందోళన!

ABN , First Publish Date - 2021-11-26T21:20:02+05:30 IST

నవంబర్ 19న దేశ రైతాంగానికి క్షమాపణలు చెబుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాగు చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించిన అనంతరం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే వివాదాస్పద సాగు చట్టాల్ని ఇరు సభల ఆమోదం పొందేలా చేసి రాష్ట్రపతి సంతకంతో అధికారికంగా..

పార్లమెంట్ సమావేశాల తర్వాత కూడా రైతు ఆందోళన!

న్యూఢిల్లీ: నవంబర్ 19న దేశ రైతాంగానికి క్షమాపణలు చెబుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాగు చట్టాల్ని రద్దు చేస్తామని ప్రకటించిన అనంతరం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే వివాదాస్పద సాగు చట్టాల్ని ఇరు సభల ఆమోదం పొందేలా చేసి రాష్ట్రపతి సంతకంతో అధికారికంగా వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు చట్టాల రద్దుకు ఆందోళన చేపట్టిన రైతులు.. ఈ సమావేశాల అనంతరం కూడా ఆందోళన కొనసాగించాలని అనుకుంటున్నారు. సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరపై అధికారికంగా చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కనీస మద్దతు ధర అందుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చట్టబద్ధమైన హామీ గురించి మాత్రం ప్రస్తావించడం లేదు. దీంతో సాగు చట్టాలు అధికారికంగా రద్దు అయినప్పటికీ ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనను పార్లమెంట్ సమావేశాల అనంతరం కూడా కొనసాగించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణ ఈ నెల 27న జరిగే రైతు సంఘాల సంయుక్త సమావేశంలో చర్చిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగిన కిసాన్ పంచాయత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులు, కనీస మద్దతు ధరపై చట్టం రూపుదాల్చే వరకు ఆందోళన చేస్తారని వివిధ రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

Updated Date - 2021-11-26T21:20:02+05:30 IST