రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: జేసీ

ABN , First Publish Date - 2022-09-24T05:13:40+05:30 IST

పండ్ల తోటలు సాగుచేసే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ పేర్కొన్నారు.

రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: జేసీ

గార్లదిన్నె, సెప్టెంబరు 23: పండ్ల తోటలు సాగుచేసే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ పేర్కొన్నారు. మండలంలోని జంబులదిన్నె కొట్టాల గ్రామ సమీపంలోని రైతు రామాం జనేయులురెడ్డి పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పండ్ల మొక్కల పెంపకాన్ని శుక్రవారం హర్టికల్చర్‌ డీడీ రఘునాథ్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు అందుతున్న లబ్ధి తదితర విషయాలను సంబంధిత అధికారు లతో చర్చించారు. అనంతరం రైతు రామాంజనేయులురెడ్డితో జేసీ మాట్లా డారు. ఈ పంట నమోదు చేసుకున్న రైతు రామాంజనేయులురెడ్డికి జాయింట్‌ కలెక్టర్‌ కేతనగార్గ్‌ స్వయంగా ఈ కేవైసీ చేయించి రశీదు అందచేశారు. తహసీల్దార్‌ ఉషారాణి, ఎంపీడీఓ విజయ్‌ భాస్కర్‌, ఏఓ సోమశేఖర్‌, ఏపీఓ నాంచా రమ్మ, ఉద్యానవనశాఖ సిబ్బంది ఆదినారాయణ, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:13:40+05:30 IST