బాధిత రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-11-29T06:01:49+05:30 IST

తొర్తి ఇసుక క్వారీతో నష్టపోయి న తమను ఆదుకోవాలని శనివారం తహసీల్దార్‌ సురేష్‌ కు, ఎస్సై హరిప్రసాద్‌లకు పాలెం రైతులు వినతిపత్రం అందజేశారు.

బాధిత రైతులను ఆదుకోవాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతులు

ఏర్గట్ల, నవంబరు 28: తొర్తి ఇసుక క్వారీతో నష్టపోయి న తమను ఆదుకోవాలని శనివారం తహసీల్దార్‌ సురేష్‌ కు, ఎస్సై హరిప్రసాద్‌లకు పాలెం రైతులు వినతిపత్రం అందజేశారు. పెద్దవాగును ఆనుకొని ఉన్న పొలాలకు వా గు నుంచి మోటార్లు, ఫీల్టర్లు, పైప్‌లైన్‌, స్టాటర్లు వేసుకొ ని, 30 ఏళ్లుగా పంటలు పండిస్తున్నామన్నారు. తొర్తి వా గులో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీతో అవన్నీ పాడైపో యాయని, ఇసుక తీయొద్దని వీడీసీకి పలుమార్లు  వి న్నవించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలుక గంగాధర్‌, జగురంపల్లి గణేస్‌, ఏనుగు గంగారాం, శంకర్‌, రాజన్న, కిషన్‌, గంగాధర్‌లు పాల్గొన్నారు.  

ఇసుక తీయడం ఆపివేయాలి

మోర్తాడ్‌ : పాలెం రైతులు తొర్లి శివారులోని పెద్దవా గు నుంచి ఇసుకను తీయడాన్ని మానుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. తొర్తి పెద్దవాగు నుంచి ఇసుక పాయింట్‌ను ఏర్పాటు చేయడంతో పాలెం రైతుల కరెం టు మోటార్లు, ఫిల్టర్‌లు, పైప్‌లైన్‌లు, షాటర్ల నుంచి ట్రా క్టర్‌, టిప్పర్‌ల ద్వారా ధ్వంసమవుతున్నాయని రైతులు ఆ రోపించారు. ఈ విషయాన్ని తొర్తి గ్రామ కమిటీకి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. 

Updated Date - 2020-11-29T06:01:49+05:30 IST