రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి

Sep 22 2021 @ 00:29AM
లింగసముద్రంలో సాగైన వరినారుమళ్లు

గుడ్లూరు, సెప్టెంబరు 21 : ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలపై మక్కువ చూపితే ఏ రైతు నష్టపోకుండా అధిక లాభాలు పోందవచ్చునని  వ్యవసాయ శాఖ మండల అధికారిణి గీతాప్రకాష్‌ అన్నారు. మండలంలోని చెమిడిదెపాడు రైతు భరోసా కేంద్రం లో,  గ్రామస్ధాయి వ్యవసాయ సహాయ మండలి సభ్యులతో శిక్షణ కార్యక్రమం మంగళ వారం నిర్వహి ంచారు. ఈ కార్యక్రమమానికి గుడ్లూరు - 1, గుడ్లూరు- 2,   పోట్లూరు, చెమిడిదెపాడు, రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఉన్న సహాయక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వాతావరణ అనుకూలతలు, పంటల స్ధితిగతులు,  ప్రత్యామ్నాయ పంటల సాగుచేపట్టడం ద్వారా రైతులకు వనగూరే,  లాభదాయక వ్యవసాయ పద్దతులను గురించి వివరించారు. అనంతరం పలువురు రైతులకు ఉచితపంటల బీమా పథకంతో పాటు, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, సున్నావడ్డీ,  ఇతరేతర పంట రుణాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తేజశ్రీ, సౌభాగ్య, వెంకట్రావు,  స్వర్ణా, గ్రామ రైతులు తధితరులు పాల్గోన్నారు. 

లింగసముద్రం : మండలంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ముమ్మరంగా పొగనారుసాగు చేస్తున్నారు. గత ఏడాది తీవ్రంగా నష్టం రావడంతో ఆ నష్టన్ని పూడ్చుకునేందుకు రైతులు ఈ ఏడాది కూడా జోరుగా పొగనారు మడులు సాగుచేస్తున్నారు. మండలంలోని వెంగళాపురం, పెంట్రాల, గొల్లపాలెం, మొగిలిచెర్ల తదితర గ్రామాల్లో రైతులు పొగనారు మడులు సాగుచేస్తున్నారు. అయితే రైతులు కందుకూరులోని సీటీఆర్‌ఐ కేంద్రం నుంచి సిరి, ఎఫ్‌సీఆర్‌ 15 రకం విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నారు.ఈ పొగనారు మడుల సాగుకు రైతులు రాజమండ్రి నుంచి మెళకువలు తెలిసిన కూలీలను రప్పించి పొగనారు సాగు చేస్తున్నారు. వీరు మూడు నెలల పాటు ఈ నారు మడుల సాగు వద్ద ఉంటారు. ప్రస్తుతం వర్షాలు కురవక పోవడంతో రైతులు దూర ప్రాంతాలలోని బోర్ల నుండి పైపులైన్ల ద్వారా నారు మడుల వద్ద గుంతలు  తీసి నీరు ఇంకిపోకుండా ప్లాస్టిక్‌ పరదాలు వేసి నీటిని నింపుకుంటున్నారు. ఈ ఏడాదైనా ప్రకృతి సహకరించాలని రైతులు కోరుతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.