రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-06-30T05:46:12+05:30 IST

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రామలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చంద్లాపూర్‌ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మల్బరీ తోటలను, పట్టుపురుగుల షెడ్‌లను వనపర్తి జిల్లాకు చెందిన 30 మంది రైతులు పరిశీలించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
చంద్లాపూర్‌లో మల్బరీ తోటను పరిశీలిస్తున్న వనపర్తి జిల్లా రైతులు

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రామలక్ష్మి


చిన్నకోడూరు, జూన్‌ 29 : రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రామలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని చంద్లాపూర్‌ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మల్బరీ తోటలను, పట్టుపురుగుల షెడ్‌లను వనపర్తి జిల్లాకు చెందిన 30 మంది రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం మల్బరీ సాగు చేస్తున్న గ్రామ రైతు ఐలయ్య పట్టు పురుగుల పెంపకం, లాభాలను గూర్చి తన అనుభవాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సెరికల్చర్‌ ఉపసంచాలకులు లత, ఉద్యాన అధికారి భాస్కర్‌రెడ్డి, సెరికల్చర్‌ అధికారి లింగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:46:12+05:30 IST