రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-05-29T05:06:50+05:30 IST

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లా భసాటి పంటలను పండించుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాక ర్‌రెడ్డి సూచించారు.

రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించాలి
మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి

- రావుల పల్లిలో రావెప్‌ విద్యార్థుల సాంకేతిక ప్రదర్శన

- విద్యార్థులను అభినందించిన గ్రామస్థులు

భూత్పూర్‌, మే 28 : రైతులు ఆధునిక  వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లా భసాటి పంటలను పండించుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాక ర్‌రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రావెప్‌ విద్యార్థులు నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన- రైతు సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథు లుగా ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రదర్శించి న వివిధ రకాల పంటల విత్తనాలు, పంటల సాగు, దిగుబడి, అనేక ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. అంతకుముందు రైతు సదస్సును వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కు సకాలంలో పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్ర మానికి హాజరైన పాలెం వ్యవసాయ కాళాశాల ప్రిన్సిపాల్‌ పుష్పావతి రైతులకు వ్యవసాయంలో మేళకువలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తనాల ఎంపి క, సేంద్రియ వ్యవసాయ విధానం, పురుగు మందుల వాడకం, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, రైతులకు అనేక విషయాలపై అవగాహన కల్పించారు. రావులప ల్లిలో నాలుగు మాసాలుగా రావెప్‌ విద్యార్థులు నేర్చుకున్న పలు విష యాల గురించి రైతులకు వివరించారు. అదే విధంగా వ్యవసాయ శాస్త్ర వేత్తలు రైతులకు పంటల గురించి పలు విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్‌, ఏడీఏ యశ్వంత్‌రావు, శాస్త్రవేత్తలు డాక్టర్‌ అర్చన, డాక్టర్‌ గోవర్ధన్‌, డాక్టర్‌ రామకృష్ణ, సింగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, భూత్పూర్‌ మాజీ సర్పంచ్‌ నారాయణగౌడ్‌, రావులపల్లి గ్రామ సర్పంచ్‌ శ్రీనయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:06:50+05:30 IST