ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు

ABN , First Publish Date - 2021-10-27T04:43:47+05:30 IST

మండలంలోని ఉలిందకొండ గ్రామంలో ప్రభుత్వ భూములను నగరానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు అమ్మేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు.

ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు
నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

  1.  రైతుల ధర్నా


కల్లూరు, అక్టోబరు 26: మండలంలోని ఉలిందకొండ గ్రామంలో ప్రభుత్వ భూములను నగరానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు అమ్మేసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఉలిందకొండకు చెందిన రైతులు బోయ నడిపి నాగన్న, వెంకటేశ్వరమ్మ నిరసన వ్యక్తం చేశారు. ఉలిందకొండలోని సర్వే నెంబరు 651/1, 2 లో గత 40 ఏళ్లుగా తొమ్మిదెకరాల బంజరు భూమిని లక్షలు వెచ్చించి సాగు భూమిగా మార్చుకుని వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. సదురు భూమికి డీపట్టా, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ ఏళ్లతరబడి కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకపోయిందన్నారు. రెండు నెలల క్రితం డి-పట్టా ఇవ్వాలని కోరగా ఓ అధికారి ఎకరాకు రూ.1.5 లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అనుచరులైన ఏజెంట్లతో మధ్యవర్తిత్వం చేసి కుమ్మక్కై సదురు పొలాన్ని రికార్డుల్లో ఎక్కించి మార్పులు, చేర్పులు చేసి అమ్మేసుకున్నట్లు గ్రామంలో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలోకి ఎలా వస్తారని ప్రశ్నించగా గొడవకు దిగి కుటుంబ సభ్యులను గాయపరిచారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. 


Updated Date - 2021-10-27T04:43:47+05:30 IST