ధాన్యం నిధుల కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-01-20T05:45:33+05:30 IST

ధాన్యం నిధుల కోసం ఎదురుచూపులు

ధాన్యం నిధుల కోసం ఎదురుచూపులు

ప్రభుత్వం నుంచి ఆగిపోయిన నగదు

డబ్బులు రాక విలవిల

ఇప్పటి వరకు చెల్లించినవి రూ.140.63 కోట్లు

ఇంకా చెల్లించాల్సినవి రూ.210.25 కోట్లు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జనవరి 20 : ధాన్యం నిధులకు బ్రేక్‌ పడింది... గత పన్నెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం చెల్లింపులు చేయకుండ నిధులు నిలిపివేసింది. ప్రభుత్వానికి ధాన్యం అమ్మి రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఎంతకు నగదు తమ ఖాతాల్లో జమ కాకపోవడంతో డబ్బులు కోసం రైతులు విల..విలలాడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 37157 మంది రైతులు గాను రూ.350.88 కోట్లు నగదు చెల్లింపులు చేయాల్సి ఉండగా అందులో ఇప్పటి వరకు 14741 మంది రైతులకు రూ.140.63 కోట్లు చెల్లించారు. ఇంకా 22416 మంది రైతులకు రూ.210.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. 


జిల్లాలో కొనుగోళ్లు ఇలా..

జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు... ప్రతి విమర్శలు చేసుకోవడం మధ్య ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణ చివరి దశలో ఇప్పటికి 211 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రస్తుతం ఇంకా 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటి వరకు గ్రేడ్‌-ఏ రకం 75,327.440 మెట్రిక్‌ టన్నుల కామన్‌ రకం ధాన్యం 1,04,765.740 మె ట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వెరసి 1,80,093.180 మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఖరీదు చేసిన ధాన్యంలో 1,78,942.140 మెట్రిక్‌ టన్నులు మిల్లులకు తరలించగా ఇంకా 1151.040 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నాయి. 


ఖరీదుల్లో పీఏసీఎస్‌ టాప్‌...

ఈ వానకాల సీజన్‌లో పీఏసీఎస్‌ ద్వారానే అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఐకేపీ ఆధ్వర్యంలో 10,398 మంది రైతుల నుంచి 48,620  మెట్రిక్‌ టన్నులు పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 24,003 మంది రైతుల నుంచి 1,18,190 జీసీసీ ఆధ్వర్యంలో 1790 మంది రైతుల నుంచి 8,892 మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 459 మంది రైతుల నుంచి 2,183 మెప్మా ఆధ్వర్యంలో 185 మంది రైతుల నుంచి 863, బీహెచ్‌ఎ్‌సవో ఆధ్వర్యంలో 322 మంది రైతుల నుంచి 1,343 మెట్రిక్‌ టన్నులు ఖరీదు చేశారు.


నిర్వాహకుల కమీషన్‌లు ఆలస్యమే...

జిల్లాలో 2021 ఖరీఫ్‌ సీజన్‌లో రూ.4.02 కోట్లు, రబీలో రూ.6.11 కోట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా విడుదల చేయలేదు. గత రబీలో డీఆర్‌డీఏ ధాన్యం కొనుగోలుదారులకు రూ. 1.63 కోట్లు, ప్రాథమిక సహాకార సంఘాలకు రూ.4.18 కోట్లు, జీసీసీకి రూ.9.10 లక్షలు, మెప్మాకు రూ.9.04 లక్షలు, వ్యవసాయ మార్కెట్‌లకు రూ.8.89 లక్షలు, నేరడ ధరణి సంస్థకు రూ.2.13 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.


చెల్లింపులు 53.2 శాతమే..

జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఐకేపీ, పీఏసీఎస్‌, జీసీసీ, మార్కెట్‌లు, మెప్మా, డీహెచ్‌ఎ్‌సవోల ద్వారా 371,57 మంది రైతుల నుంచి 180093 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఖరీదు చేశారు. దాని విలువ రూ.35,088, 73,180లు ఆన్‌లైన్‌లో సంబంధిత కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది ఆలసత్వం ప్రదర్శించడంతో అధికమంది రైతులకు ఆన్‌లైన్‌ నమోదు చేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో రైతులకు నగదు చెల్లింపుల్లో ఆలస్యం జ రిగింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 28,241 మంది రైతుల 1,36,093 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, రూ.265,27,02,400లు వివరాలు మాత్రమే నమోదు చేశారు. దీంతో 14741 మంది రైతులకు 721 37 మెట్రిక్‌ టన్నులు, రూ.1406332968 లు చెల్లింపులు జరిగాయి.  ఇంకా 22416 మంది రైతులకు రూ.2,10,25,40,212 ప్రభుత్వం నుంచి చెల్లించాల్సి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైందో ఎమో కానీ గత పన్నెండు రోజుల నుంచి ధాన్యం నగ దు చెల్లింపులు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రైతు లు పరేషాన్‌కు గురవుతున్నారు. రేపు వస్తాయా... మాపు వస్తాయా... అంటూ నగదు కోసం రైతులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


ఓటీపీ వచ్చి 15 రోజులయింది.. : ఎన్నమాల శ్రీనివాస్‌, రైతు, గోపాలగిరి, తొర్రూరు 

129 బస్తాలు పండగా ధాన్యం కొనుగోలు కేంద్రం లో అమ్మి ఓటీపీ వచ్చి 15 రోజులు అవుతున్న ప్రభు త్వం నుంచి డబ్బులు రాలే... యాసంగి పెట్టుబడి కోసం అవసరం వస్తాయని ఎదురుచూసి.. ఎదురుచూసి బయట నుంచి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుం ది. ప్రభుత్వం వెంటనే ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలి.


బడ్జెట్‌ లేకనే ఆగిపోయింది : యు.మహేందర్‌, జిల్లా సివిల్‌సప్లై మేనేజర్‌

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిధులు బడ్జెట్‌ లేకపోవడంతోనే 12 రోజుల నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. జిల్లాలో ఇంకా రూ.210 కోట్ల రైతులకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నగదు విడుదల కాగానే రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరుగుతాయి. 

Updated Date - 2022-01-20T05:45:33+05:30 IST