భారత్‌మాల సర్వేను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-08-13T05:38:28+05:30 IST

మండలంలోని జక్లేర్‌ వద్ద శుక్రవారం రైతులు భారత్‌మాల సర్వే పనులను అడ్డుకున్నారు. జాతీయ రహదారి 167 నిర్మాణం కోసం భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల పరిహారం ఇస్తామని చెబుతున్నారని ఇది మాకు ఎంతమాత్రం సరిపోదని రైతులు ముక్తకంఠంతో పేర్కొన్నారు.

భారత్‌మాల సర్వేను అడ్డుకున్న రైతులు
భారత్‌మాల సర్వేను అడ్డుకుంటున్న రైతులు

- పరిహారం తక్కువపై మండిపాటు 

- సమాచారం ఇవ్వకుండా గ్రామంలోకి రావడంపై నిరసన 


మక్తల్‌ రూరల్‌, ఆగస్టు 12: మండలంలోని జక్లేర్‌ వద్ద శుక్రవారం రైతులు భారత్‌మాల సర్వే పనులను అడ్డుకున్నారు. జాతీయ రహదారి 167 నిర్మాణం కోసం భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల పరిహారం ఇస్తామని చెబుతున్నారని ఇది మాకు ఎంతమాత్రం సరిపోదని రైతులు ముక్తకంఠంతో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎకరం ధర రూ.కోటి రూపాయలు ఉందన్నారు. భూసేకరణ కోసం ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి, సర్వేయర్లు కృష్ణయ్య, రంగయ్యలు సర్వే చేస్తుండగా రైతులు ఒక్కసారిగా వచ్చి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు సర్వే చేయకుండానే వెళ్లిపో యారు. అధికారులు తమకు మాటమాత్రమైనా తెలుపకుండా సర్వే చేయడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. మరోసారి సర్వే చేయాలనుకుంటే రైతులను సంప్రదించి ఆమోదం లభించిన తర్వాతనే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు వీరేశ్వర్‌రెడ్డి, భీంసేన్‌, టీఎన్‌బాబు, చంద్రకాంత్‌గౌడ్‌, నాగరాజు, అలీపాష, జగన్నాథ్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, నారాయణ, సలీం, కిష్టప్ప తదితరులున్నారు. 

Updated Date - 2022-08-13T05:38:28+05:30 IST