ఫాంహౌస్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-07-27T06:57:10+05:30 IST

అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించారని రుజువు కావడంతో గ్రామంలోని ఓ ఫాంహౌజ్‌ను ఆర్డీవో ఆదేశానుసారం ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సీజ్‌ చేశారు.

ఫాంహౌస్‌ సీజ్‌

మోటకొండూరు, జూలై 26: అసాంఘీక కార్యకలాపాలు నిర్వహించారని రుజువు కావడంతో గ్రామంలోని ఓ ఫాంహౌజ్‌ను ఆర్డీవో ఆదేశానుసారం ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం  సీజ్‌ చేశారు. గ్రామంలోని ఓ మామిడి తోటపై ఏప్రిల్‌ 26న రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు దాడి  చేయగా వివాహేతర సంబంధం ఉన్న ఇద్దరు పట్టుబడ్డారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. అధికారుల విచారణలో నేరం రుజువు కావడంతో ఫాంహౌజ్‌ను సీజ్‌ చేయించారు.


Updated Date - 2021-07-27T06:57:10+05:30 IST