పొలం పనుల్లో నాన్నకు చేదోడుగా..

ABN , First Publish Date - 2020-07-06T22:02:49+05:30 IST

ఈ పక్కనున్న దృశ్యం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కెమేరా కంటికి చిక్కింది.

పొలం పనుల్లో నాన్నకు చేదోడుగా..

సంగారెడ్డి: ఈ పక్కనున్న దృశ్యం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కెమేరా కంటికి చిక్కింది. ఓ పొలంలో తండ్రికి చేదోడుగా ఉన్న ఇద్దరు తనయులు వీళ్లు. కరోనా కారణంగా పాఠశాలలు మూసేయడంతో ఇలా నాన్నకు సాయం చేస్తున్నారు. పొలంలో కలుపు తీస్తున్న తండ్రికి తోడుగా తాము సైతం అంటూ రైతన్నలుగా మారిపోయారు. గ్రామాల్లో ఉండే వారికి ఇలాంటివన్నీ సహజం. పొద్దున్నే పొలం పనులకు వెళ్లడం.. అక్కడి పనుల్లో తామూ ఓ చేయి వేయడం చేస్తుంటారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 



Updated Date - 2020-07-06T22:02:49+05:30 IST