నాజూగ్గా కనిపించాలంటే...

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

లావుగా ఉండేవాళ్లు దుస్తులతో నాజూగ్గా, ఫ్యాషన్‌గా కనిపించడానికి తపన పడుతుంటారు. అలా కనిపించాలనుకునే వారికి కొన్ని టిప్స్‌...

నాజూగ్గా కనిపించాలంటే...

లావుగా ఉండేవాళ్లు దుస్తులతో నాజూగ్గా, ఫ్యాషన్‌గా కనిపించడానికి తపన పడుతుంటారు. అలా కనిపించాలనుకునే వారికి కొన్ని టిప్స్‌.


 లావుగా ఉండేవాళ్లు ముదురు రంగులు వేసుకుంటే సన్నగా, ఫిట్‌గా కనిపిస్తారు. అందుకే తెలుపు, గులాబిరంగు, క్రీం లాంటి లేతరంగు షేడ్స్‌ జోలికి పోకుండా నీలం, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ లాంటి ముదురురంగు దుస్తులు ధరిస్తే బాగుంటారు.

యాక్ససరీస్‌ విషయంలో కూడా వీళ్లు శ్రద్ధ తీసుకోవాలి. సరైన యాక్ససరీస్‌ వాడాలి. ఉదాహరణకు సరైన షేడ్స్‌లో ఉండే షూస్‌ వేసుకుంటే మీ పొట్టను ఎవ్వరూ పట్టించుకోరు.

శరీరంలోని  కొవ్వు కనిపించకుండా ప్రింట్స్‌ డామినేట్‌ చేస్తాయి. ఫ్లోరల్‌ ప్రింట్స్‌, చెక్స్‌ ఉన్న దుస్తులు ధరిస్తే చూడడానికి అందంగా, పొందిగ్గా కనిపిస్తారు. 

బ్లేజర్‌, జాకెట్‌, వెయిస్ట్‌ కోస్ట్‌ వేసుకుంటే ట్రెండీగా, కూల్‌గా కనిపిస్తారు. 

 పొడుగు గీతలున్న టీషర్టులు, ట్రోజర్స్‌ వంటి వాటిని వేసుకుంటే మీరు ఉన్న పొడుగు కన్నా ఇంకా ఎక్కువ పొడుగ్గా, సరైన ఫిట్‌నె్‌సతో ఫ్యాషన్‌గా కనపడతారు.

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST