నేక్ పై అంతస్తులో కలెక్టర్ గది, సమావేశ మందిరం పనులు చేస్తున్న దృశ్యాలు
శాఖల వారీగా చాంబర్ల కేటాయింపు
‘నేక్’ పై అంతస్తులో కలెక్టర్ చాంబర్
ఎదురెదురుగా జాయింట్ కలెక్టర్ చాంబర్లు
డీఆర్వో ఆఫీసు కూడా పై అంతస్తులోనే
కింద ఫ్లోర్లో వివిధ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాలు
వైటీసీలో డీఎంహెచ్‌వో, ఐఅండ్‌పీఆర్, ఇతర ఆఫీసులు
(రాజమహేంద్రవరం-ఆంఽధ్రజ్యోతి)
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త జిల్లాకు కలెక్టరేట్ సిద్ధమవుతోంది. బొమ్మూరు-వేమగిరి హైవేలో హార్లిక్స్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్టక్షన్ (నేక్)లో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 48 గదులు, హాళ్లు ఉన్న ఈ భ వనం రెండు అంతస్తులతో ఉంది. పై అంతస్తులో మెట్ల పక్కనే కలెక్టర్ చాంబర్ ముస్తాబవుతోంది. నేక్ పై అంతస్తులోని 35 నెంబరు గదిలో కలెక్టర్ చాంబర్, 34 నెంబరు గదిలో కలెక్టర్ ఆఫీసుకు అటాచ్డ్ రూమ్‌లు, 36వ నెంబరు గదిలో ఏసీ మీటింగ్ హాలు, 50, 53 నెంబర్ల గదుల్లో జాయింట్ కలెక్టర్ల చాంబర్లు, 46వ నెంబరు గదిలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) కార్యాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.
నేక్‌లో శాఖల వారీగా కేటాయింపులు
నేక్ కింది అంతస్తులోకి ప్రవేశించగానే కుడివైపున ఒకటో గదిలో కార్పొరేషన్, రెండో గదిలో బీసీ కార్పొరేషన్, 3లో మైనారిటీ కార్పొరేషన్ అండ్ వెల్పేర్, 4లో డిజేబిలిటీ (దివ్యాంగ), 5, 6ల్లో హౌసింగ్, 7లో డీఆర్డీఏ, 8లో ఎలక్ట్రికల్ రూమ్, 9లో టాయిలెట్స్, 10లో రికార్డు రూమ్, 11లో సీపీవో ఆఫీసు, 12లో స్పందన ఉంటాయి. కింద అంతస్తులో ప్ర వేశించగానే ఎడమ వైపు 21వ గదిలో వ్యవసాయ శాఖ జేడీ, ప్రవేశమార్గంలో ఎదురెదురుగా ఉన్న గదుల్లోని 25లో అగ్రికల్చరల్ డైరెక్టర్, 22లో డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాలను కేటాయించారు. గది నెం.20లో డీఎస్వో, 19లో సివిల్ సప్లయిస్ డీఎం, 18లో సెమినార్ హాలు, 17లో రికార్డు రూమ్, 16లో టాయిలెట్స్, 15లో రికార్డు రూమ్, 14లో పీడీ ఏఎంఎంఐపీ (ప్రస్తుతం ఈ గది నేక్ ఏడీ రూమ్‌గా ఉంది), 13లో మీటింగ్ హాలుగా కేటాయించారు. ఇప్పటికే ఆయా శాఖలకు కేటాయించినట్టు స్టిక్కర్లు అతికించారు. కానీ పై అంతస్తులో కలెక్టర్, జేసీలు, డీఆర్వో చాంబర్లలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. నేక్ను తెలుగు విశ్వవిద్యాలయానికి తరలించనున్నారు. నేక్ గుమ్మం ముందు జెండా దిమ్మ సిద్ధం చేస్తున్నారు.
గిరిజన యువత శిక్షణా కేంద్రం(వైటీసీ)లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌వో), దాని సంబంధిత కార్యాలయాలు, జిల్లా సమాచార పౌర సంబంఽధాలు (ఐఅండ్ పీఆర్), సెరికల్చర్ డీడీ, డ్వామా పీడీ, జిల్లా పరిశ్రమల శాఖ, జిల్లా ఫైర్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్, ఏపీ మార్క్‌ఫెడ్ డీఎం, డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ ఏసీ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సెట్రాజ్, జిల్లా యూత్ వెల్ఫేర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సుగర్కేన్ అసిస్టెంట్ కమిషనర్, ఏపీఈపీడబ్ల్యుఐడీసీ ఈఈ, పీసీబీ ఈఈ, ఎన్‌ఆర్‌ఈడీ క్యాప్ కార్యాలయంలను కేటాయించారు. కానీ వైటీసీ అధికారులకు, వీటిని పర్యవేక్షించే ఐటీడీఏ పీవోకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ వివిధ శాఖలకు చాంబర్లు కే టాయించడం, వాటికి స్టిక్కర్లు కూడా అతికించడంపై వైటీసీ సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమను ఎక్కడికి తరలిస్తారో కూడా చెప్పలేదంటున్నారు.