ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులతో బాధితులకు సత్వర న్యాయం

ABN , First Publish Date - 2021-03-09T05:53:46+05:30 IST

అత్యాచార ఘటనల్లో బాధితులకు సత్వర న్యాయమందించేందుకు జిల్లా కేంద్రంలో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసినట్లు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలీ తెలిపారు.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులతో బాధితులకు సత్వర న్యాయం
అభినంద్‌ కుమార్‌ షావిలీ సూచనలతో పోక్సో స్పెషల్‌ కోర్టును ప్రారంభిస్తున్న ఖమ్మం సెషన్‌ కోర్టు న్యాయమూర్తి హరేకృష్ణ భూపతి, కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలీ

చుంచుపల్లిలో పోక్సో ట్రాక్‌ స్పెషల్‌ కోర్టు ప్రారంభం

చుంచుపల్లి, మార్చి 8: అత్యాచార ఘటనల్లో బాధితులకు సత్వర న్యాయమందించేందుకు జిల్లా కేంద్రంలో ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్టును ఏర్పాటు చేసినట్లు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలీ తెలిపారు. సోమవారం చుంచుపల్లి మండలం తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పోక్సో ట్రాక్‌ స్పెషల్‌ కో ర్టును హైదరాబాద్‌ నుంచి డిజిటల్‌ పద్ధతి ద్వారా ప్రారంభోత్సవం చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భద్రాద్రి జిల్లాలో కోర్టు ఏర్పాటు ద్వారా నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయడంతోపా టు మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులకు తక్ష ణ శిక్షలు అమలు చేసేందుకు వీలవుతుందన్నారు. కోర్టు ఏర్పాటుకు స త్వరం స్పందించి భవనాన్ని మంజూరు చేసిన కలెక్టర్‌ ఎంవీ. రెడ్డిని ఆ యన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కేంద్రంలో కోర్టుల సముదాయాలు ఏర్పాటుకు 25 ఎకరాలు భూమి కేటాయించారని నిర్మాణం పూ ర్తయ్యే వరకు విధులు ఇక్కడనే నిర్వహిస్తామన్నారు. అనంతరం ఖ మ్మం ఫస్ట్‌ క్లాస్‌ అదనపు జిల్లా జడ్జి బాల భాస్కర్‌ మాట్లాడుతూ.... ఖ మ్మం నుంచి భద్రాద్రి జిల్లాకు 300 అత్యాచార కేసులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన కేసులు పెండింగ్‌లో ఉంటే తన దృ ష్టికి తీసుకొస్తే తక్షణం ఇక్కడికి బదిలీచేసి బాధితులకు సత్వర న్యా యం అందించే విధంగా కృషిచేస్తామన్నారు. కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మా ట్లాడుతూ.... పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్ర త్యేకంగా కోర్టు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కా ర్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీనివాస్‌, శిరీష, దీప, నీలిమ, ఎస్పీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్‌ అనుదీప్‌, రాష్ట్ర బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాజుద్దీన్‌బాబా, లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గోపీకృష్ణ, వైస్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరావు, అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌, మారపాక రమేష్‌, డీఆర్వో అశోక చక్రవర్తి, పంచాయతీరాజ్‌ ఈఈ సుధాకర్‌, సంక్షేమ అధికారి వరలక్ష్మీ, కొత్తగూడెం మునిసిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-09T05:53:46+05:30 IST