Viral Video: పరీక్షలో కుమారుడి ఘనత.. 100కు 6 మార్కులు.. వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి!

ABN , First Publish Date - 2022-07-03T18:37:44+05:30 IST

తమ కుమారుడు పరీక్షల్లో మంచి ప్రతిభ చూపించాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అందరిలానే అతడు కూడా అదే ఆశించాడు. ఓ మోస్తారు మార్కులు రాబడుతున్న తన కుమారుడి కోసం రంగంలోకి దిగాడు. ఎన్ని

Viral Video: పరీక్షలో కుమారుడి ఘనత.. 100కు 6 మార్కులు.. వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి!

ఇంటర్నెట్ డెస్క్: తమ కుమారుడు పరీక్షల్లో మంచి ప్రతిభ చూపించాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అందరిలానే అతడు కూడా అదే ఆశించాడు. ఓ మోస్తారు మార్కులు రాబడుతున్న తన కుమారుడి కోసం రంగంలోకి దిగాడు. ఎన్ని పనులు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా ప్రత్యేకంగా అతడికి పాఠాలు చెప్పాడు. అయితే.. చివరికి అతడి ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనాకు చెందిన వ్యక్తికి తన కుమారుడు లెక్కల్లో వీక్ అనే విషయం అర్థమైంది. మోస్తరు మార్కులతో నెట్టుకొస్తున్న అతడికి.. స్వయంగా శిక్షణ ఇచ్చి మంచి మార్కులు సాధించేలా తీర్చి దిద్దాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్ని పనులు ఉన్నా.. అతడు వాటిని పట్టించుకోలేదు. అర్ధరాత్రి వరకూ కుమారుడితోనే గడుపుతూ గణిత పాఠాలు భోదించాడు. ఇలా ఏడాదిపాటు ప్రత్యక శిక్షణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎగ్జామ్స్‌లో తన కొడుకు అత్యత్తమ మార్కులు సాధిస్తాడని ఆశపడ్డాడు. అయితే అతడి ఆశలు అడియాసలు అయ్యాయి. లెక్కల్లో తన కుమారుడికి 100కు కేవలం 6 మార్కులే రావడంతో ఆ తండ్రి కంగుతిన్నాడు. ఏడాది శిక్షణ వృధా అయిందని వెక్కి వెక్కి ఏడ్చాడు. 


ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... తండ్రి దగ్గర శిక్షణ తీసుకోవడానికి ముందు ఆ కుర్రాడికి లెక్కల్లో 100కు 40 నుంచి 50 మార్కులు వచ్చేవట. ఒకానొక సందర్భంలో 90 మార్కులు కూడా సాధించాడట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆ తండ్రి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 




Updated Date - 2022-07-03T18:37:44+05:30 IST