దేవుడే దిక్కంటూ చేతులెత్తేసిన వైద్యులు.. ఆ మాటలనే బలంగా నమ్మిన తండ్రి.. కొడుకుతో కలిసి నెలరోజులుగా గుడిలో..

ABN , First Publish Date - 2022-02-04T22:12:56+05:30 IST

15ఏళ్ల కుర్రాడికి వైద్యం చెయ్యలేక వైద్యులు చేతులెత్తేశారు. ‘చేయాల్సిందంతా చేశాం. ఇక మా చేతుల్లో ఏం లేదు. దేవుడే ఈ కుర్రాడ్ని కాపాడాలి’ అంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ మాటలనే ఆ కుర్రాడి తం

దేవుడే దిక్కంటూ చేతులెత్తేసిన వైద్యులు.. ఆ మాటలనే బలంగా నమ్మిన తండ్రి.. కొడుకుతో కలిసి నెలరోజులుగా గుడిలో..

ఇంటర్నెట్ డెస్క్: 15ఏళ్ల కుర్రాడికి వైద్యం చెయ్యలేక వైద్యులు చేతులెత్తేశారు. ‘చేయాల్సిందంతా చేశాం. ఇక మా చేతుల్లో ఏం లేదు. దేవుడే ఈ కుర్రాడ్ని కాపాడాలి’ అంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ మాటలనే ఆ కుర్రాడి తండ్రి గట్టిగా నమ్మాడు. తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న కొడుకును వెంటపెట్టుకుని సరాసరి గుడికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ ప్రాంతానికి చెందిన బల్వంత్ సోధియా అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం విహాహం జరిగింది. ఈ క్రమంలో ఆయనకు కొడుకు, కూతురు జన్మించారు. ప్రస్తుతం ఆయన కొడుకు ప్రేమ్ సాగర్‌కు 15ఏళ్లు. కాగా.. ప్రేమ్ సాగర్‌కు రెండేళ్ల క్రితం చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో అతడికి ఓ చేయి విరిగిపోగా.. తర్వాత అది నయం అయింది. కానీ కొంత కాలంగా ప్రేమ్ సాగర్ అంతు చిక్కని వ్యాధి బారినపడ్డాడు. దీంతో బల్వంత్ సోధియా.. తన కొడుకును ఇండోర్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. కొడుకు వైద్యం కోసం సుమారు రూ.15లక్షలు ఖర్చు చేశాడు. అయినా ప్రేమ్ సాగర్ అరోగ్యం కుదుట పడలేదు. 



దీంతో వైద్యులు చేతులెత్తేశారు. ఇక దేవుడే దిక్కంటూ తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ మాటలు విని బల్వంత్ సోధియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును వెంటపెట్టుకుని మందఖేడ‌లోని సంకట మోచన హనుమాన్ టెంపుల్‌కు చేరుకున్నాడు. భారం మొత్తం దేవుడిపైనే వేసి.. తన కుమారుడి ఆరోగ్యం కుదుటపడాలని రాత్రిపగలు తేడా లేకుండా వేడుకుంటున్నాడు. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి.. మందిర ప్రాంగణంలో ఉన్న ఆయన.. తన కుమారుడికి నయం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది.




Updated Date - 2022-02-04T22:12:56+05:30 IST