
కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తి కన్న కూతురి పైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 13 ఏళ్ల కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు.. కాళ్లు పట్టమని పిలిచి కామ వాంఛ తీర్చుకున్నాడు.. ఆ బాలిక విషయం మొత్తాన్ని తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని విదిశకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాధిత బాలిక తల్లి శనివారం ఉదయం మార్కెట్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న తండ్రి ఆ బాలికను పిలిచి కాళ్లు పట్టమన్నాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి ఆ బాలిక విషయం మొత్తం చెప్పింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను మెడికల్ టెస్ట్‌లకు పంపించారు. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు ఆదివారం భోపాల్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.