
అతనికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది.. ఐదుగురు పిల్లలు పుట్టారు.. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో 45 ఏళ్ల ఆ వ్యక్తి ఇటీవల ప్రేమలో పడ్డాడు.. ఈ నెల 24న భార్యను కొట్టి ఇంట్లోని బంగారం తీసుకుని ఆ మైనర్ బాలికతో సహా పరారయ్యాడు.. దీంతో ఆ భార్య పోలీసులను ఆశ్రయించి తన భర్తను పట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది.. మరోవైపు మైనర్ బాలిక తండ్రి కూడా కిడ్నాప్ కేసు పెట్టాడు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు సమీపంలోని గ్రామానికి చెందిన తేజ్ కరణ్ అనే వ్యక్తికి 2003లో హస్తు దేవితో వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా, తమ ప్రాంతానికే చెందిన ఓ మైనర్ బాలికతో తేజ్ కరణ్ ప్రేమలో పడ్డాడు. ఆ బాలికతో కలిసి ఈ నెల 24న గ్రామం నుంచి పరారయ్యాడు. వెళ్లేటప్పుడు భార్యతో గొడవపడి ఆమెను కొట్టి ఇంట్లోని బంగారం మొత్తం తీసుకెళ్లిపోయాడు.
దీంతో హస్తు దేవి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసింది. తన భర్తను తొందరగా వెతికి పట్టుకోవాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మైనర్ బాలిక తండ్రి కూడా తేజ్ కరణ్‌పై కిడ్నాప్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.