పరీక్ష హాల్‌లో ఛీటింగ్‌కు పాల్పడినందుకు అందరి ముందు కొట్టిన తండ్రి.. షాక్‌కు గురైన ఆ బాలిక కుప్పకూలిపోయి..

ABN , First Publish Date - 2022-02-24T18:07:12+05:30 IST

ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక పరీక్షలు రాస్తోంది.. పరీక్ష గదిలో తన వెనుక బెంచిలో కూర్చున్న స్నేహితురాలికి తన ఆన్సర్ షీట్ ఇచ్చింది..

పరీక్ష హాల్‌లో ఛీటింగ్‌కు పాల్పడినందుకు అందరి ముందు కొట్టిన తండ్రి.. షాక్‌కు గురైన ఆ బాలిక కుప్పకూలిపోయి..

ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక పరీక్షలు రాస్తోంది.. పరీక్ష గదిలో తన వెనుక బెంచిలో కూర్చున్న స్నేహితురాలికి తన ఆన్సర్ షీట్ ఇచ్చింది.. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్ అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఆ బాలిక తండ్రికి ఫిర్యాదు చేసింది.. ఆ తండ్రి ఎగ్జామ్ హాల్‌లో అందరి ముందు ఆ బాలికపై చేయి చేసుకున్నాడు.. షాక్‌కు గురైన ఆ బాలిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మరణించింది. 


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన అంజలి అనే బాలిక సోమవారం ఉదయం ఎగ్జామ్ హాల్‌లో పరీక్ష రాస్తోంది. తన స్నేహితురాలు అడగడంతో ఆమెకు ఆన్సర్ షీట్ ఇచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన టీచర్ ఇద్దరినీ పట్టుకుంది. అదే స్కూల్‌లో పనిచేస్తున్న అంజలి తండ్రి హేమరాజ్ పటేల్‌కు ఫిర్యాదు చేసింది. ఆగ్రహానికి గురైన హేమరాజ్ ఎగ్జామ్ హాల్‌లో అందరి ముందు అంజలిని కొట్టాడు. దీంతో షాక్‌కు గురైన అంజలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆ బాలికను హాస్పిటల్‌కు తరలించారు.


రెండ్రోజుల చికిత్స తర్వాత కూడా అంజలి ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది. చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలోనే మరణించింది. ఈ ఘటనపై ఎవరూ కేసు పెట్టలేదు. పోస్ట్‌మార్టమ్ చేయకుండా అంజలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలియడంతో పోలీసులు స్కూలుకు వెళ్లి విచారణ చేశారు.  

Updated Date - 2022-02-24T18:07:12+05:30 IST