కుమార్తెను లోబరుచుకున్న తండ్రి.. అనంతరం 28మందితో.. వెలుగులోకి బడాబాబుల పేర్లు..!

ABN , First Publish Date - 2021-10-13T22:51:02+05:30 IST

ఓ బాలికపై కన్న తండ్రే కన్నేశాడు. లైంగికంగా లోబరుచుకుని, బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో పలువురి వద్దకు ఆ బాలికను పంపించేవాడు. నిందితుల్లో పలువురు బడాబాబులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కుమార్తెను లోబరుచుకున్న తండ్రి.. అనంతరం 28మందితో.. వెలుగులోకి బడాబాబుల పేర్లు..!

ఓ బాలికపై కన్న తండ్రే కన్నేశాడు. లైంగికంగా లోబరుచుకుని, బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో పలువురి వద్దకు ఆ బాలికను పంపించేవాడు. నిందితుల్లో పలువురు బడాబాబులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కొందరు సమీప బంధువులు ఉన్నట్టుగా బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. కొన్నేళ్లుగా వాళ్లు తనపై అత్యాచారం చేసినట్టుగా చెబుతోంది. బాలిక ఫిర్యాదు మేరకు.. లలిత్‌పూర్ పోలీసులు 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిలో బాలిక తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, ఆ పార్టీ సిటీ అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజ్‌హియా, బహుజన్ సమాజ్ పార్టీ దీపక్ అహిర్వార్ పేర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనమైంది.


 పోలీసులు, బాధితురాలి కథనం మేరకు.. ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై తండ్రి కన్నేశాడు. ఈ క్రమంలో రోజూ అసభ్యకరమైన చిత్రాలు చూపించేవాడు. పలుమార్లు లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఓ రోజు బైక్‌పై బయటకు తీసుకెళ్లి.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే.. బాలిక తల్లిని చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో ఓ రోజు హోటల్‌కు తీసుకెళ్లి, బాలికను మహిళకు అప్పగించాడు. ఆమె బాలికకు మత్తుమందు ఇచ్చి.. పలువురితో అత్యాచారం చేయించేది. ఇలా కొత్త కొత్త వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, దీంతో తాను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డానని బాధితురాలు వాపోయింది.


సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక ఆరోపించింది. అలాగే తిలక్‌ స్నేహితులు, బంధువులు తీవ్రంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. తన బంధువులు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. డబ్బుల కోసం తనను అమ్మే ప్రయత్నం కూడా చేశారని ఆరోపించింది. దీనిపై లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పతక్ మాట్లాడుతూ.. ఈ కేసును తాము సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు. బుధవారం మేజిస్ట్రేట్ సమక్షంలో బాలిక స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాలిక తండ్రిని విచారిస్తున్నారు. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుపై తిలక్ యాదవ్‌.. ప్రకటన విడుదల చేశారు. తనని, తన సోదరులను కావాలనే కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-13T22:51:02+05:30 IST