రెడీ టు ప్లే.. వచ్చేసిన ‘ఫా-జి’ మొబైల్ గేమ్!

ABN , First Publish Date - 2020-12-01T00:20:06+05:30 IST

పబ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధంతో ఉసూరుమంటూ ఉన్న గేమింగ్ ప్రియులకు ఇప్పుడు మేడిన్ ఇండియా గేమ్ ‘ఫా-జి’ అందుబాటులోకి

రెడీ టు ప్లే.. వచ్చేసిన ‘ఫా-జి’ మొబైల్ గేమ్!

న్యూఢిల్లీ: పబ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధంతో ఉసూరుమంటూ ఉన్న గేమింగ్ ప్రియులకు ఇప్పుడు మేడిన్ ఇండియా గేమ్ ‘ఫా-జి’ అందుబాటులోకి వచ్చేసింది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు గూగుల్ ప్లే స్టోర్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికైతే ఈ గేమ్‌ను లాంచ్ చేయనప్పటికీ ముందస్తు రిజిస్ట్రేషన్‌లో భాగంగా డెవలపర్లు దానిని ప్లే స్టోర్‌లో పెట్టారు. అయితే, యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం ఈ గేమ్ కనిపించలేదు. గేమింగ్ ప్రియులను కట్టిపడేసిన పబ్‌జి మొబైల్ ఇండియాపై నిషేధం విధించిన రెండు రోజుల్లోనే ఫా-జి టీజర్ విడుదల కావడం గమనార్హం. 


గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న ఫా-జిని ముందస్తు రిజిస్టర్ చేసుకున్న యూజర్లకు గేమ్ డౌన్‌లోడ్‌కి అందుబాటులోకి రాగానే నోటిఫికేషన్ వస్తుంది. యాప్ డౌన్‌లోడ్ పరిమాణం, వెర్షన్ వంటి ఇతర వివరాలు తెలియరాలేదు. ఫా-జి గేమ్‌ను బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ సహకారంతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ఎన్‌కోర్ గేమ్స్’ అభివృద్ధి చేసింది. ఈ గేమ్‌కు సంబంధించిన తొలి టీజర్ అక్టోబరు 25న కంపెనీ విడుదల చేసింది. 

Updated Date - 2020-12-01T00:20:06+05:30 IST