ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు.. అధికారుల చేతికి ఏకంగా 11 వేల ప్రభుత్వ డాక్యుమెంట్లు..

ABN , First Publish Date - 2022-09-04T01:23:26+05:30 IST

ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు.. అధికారుల చేతికి ఏకంగా 11 వేల ప్రభుత్వ డాక్యుమెంట్లు..

ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు.. అధికారుల చేతికి ఏకంగా 11 వేల ప్రభుత్వ డాక్యుమెంట్లు..

ఎన్నారై డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు(Donald Trump) చెందిన ఎస్టేట్ మార్-ఏ-లాగో(Mar-a-lago) ఎస్టేట్‌లో గత నెల 8న అమెరికా దర్యాప్తు సంస్త ఎఫ్‌బీఐ(FBI) సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను(Cofidential documents) ట్రంప్ ఈ భనవంలో దాచిపెట్టారన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ ఈ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఏయే డాక్యుమెంట్లు ఎఫ్‌బీపై లభ్యమయ్యాయో తాజాగా వెల్లడైంది. వీటికి సంబంధించి కోర్టుకు సమర్పించిన వివరాల్లో కొన్ని బహిర్గతం చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇక ఆగస్టు నాటి సోదాల్లో అధికారులకు ఏకంగా 11 వేల ప్రభుత్వ డాక్యుమెంట్లు లభ్యమయ్యాయట. వీటిల్లో అత్యంత రహస్యమైన 18 డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టు తేలింది. అయితే..90కి పైగా ఖాళీ పైళ్లు కూడా అధికారులకు దొరికాయి. ఈ ఫైళ్లు ఖాళీగా ఎందుకున్నాయి..? వీటిల్లోని డాక్యుమెంట్లు ఏమయ్యాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 


అంతకుమునుపు ఈ డ్యాకుమెంట్లకు సంబంధించి ట్రంప్ తరపు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య కోర్టులో వాదోపవాదాలు నడిచాయి. మార్-ఏ-లాగోలో దొరికిన డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ట్రంప్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే.. దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి డాక్యుమెంట్లకు సంబంధించి కొన్ని కీలక వివరాలు మాత్రం బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. మరోవైపు.. అమెరికా మాజీ అటార్నీ జనరల్ మాత్రం ట్రంప్ తరుఫు న్యాయవాదుల  అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇప్పటికే ఎఫ్‌బీఐ అధికారులు ఈ వీటిని పరిశీలించినందుకు మరో ప్రత్యేక అధికారిని నియమించడం అనవసరమని అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-09-04T01:23:26+05:30 IST