Mothers Day: ఇవాళ Mothers Day కదా.. కానీ.. ఈ అమ్మ మనసు ఎందుకు గాయపడిందంటే..

ABN , First Publish Date - 2022-05-09T00:41:56+05:30 IST

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఎంత మేలు జరిగిందో కొందరి దుర్బుద్ధి వల్ల అంతే కీడు కూడా జరుగుతోంది. Internet Blackmailers రోజురోజుకూ పెరిగిపోతున్నారు. యువకుల బలహీనతను టార్గెట్‌గా చేసుకుని..

Mothers Day: ఇవాళ Mothers Day కదా.. కానీ.. ఈ అమ్మ మనసు ఎందుకు గాయపడిందంటే..

Internet అందుబాటులోకి వచ్చాక ఎంత మేలు జరిగిందో కొందరి దుర్బుద్ధి వల్ల అంతే కీడు కూడా జరుగుతోంది. Internet Blackmailers రోజురోజుకూ పెరిగిపోతున్నారు. యువకుల బలహీనతను టార్గెట్‌గా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను తమ మోసాలకు వేదికలుగా చేసుకుంటూ ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఈ Sextortionకు బలైపోయిన బాధితుడే కాలిఫోర్నియాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ ర్యాన్ లాస్ట్. ఈ టీనేజర్ ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అందుకు కారణం.. అతని నగ్న చిత్రాలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తామని బెదిరింపులు రావడమే. అలా చేయకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని Internet Blackmailers డిమాండ్ చేశారు. అప్పటికీ ఇంట్లో తెలియకుండా చాలా డబ్బును సర్దుబాటు చేశాడు.



ఇంకా డబ్బు కావాలని, లేకపోతే అతని న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని Blackmailers బెదిరించడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడని అతని తల్లి పౌలిన్ స్ట్రౌర్ట్ కన్నీరుమున్నీరయింది. ఈ బాధ ఈ తల్లిది మాత్రమే కాదు. ఇలా బ్లాక్‌మెయిలర్స్ బారిన పడ్డ ఎంతో మంది బాధితులది. అసలు ఒక టీనేజర్ నగ్న ఫొటోలు బ్లాక్‌మెయిలర్స్ చేతికి ఎలా వెళ్లాయనే సందేహం కలగవచ్చు. ఈ బ్లాక్‌మెలింగ్‌కు పాల్పడే వాళ్లు చేసే పనేంటంటే.. అమ్మాయిల్లా Social Media అకౌంట్లు ఓపెన్ చేస్తారు. టీనేజర్లకు, యుక్త వయసులో ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాలపై కన్నేస్తారు. వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి నిజంగా ఆ రిక్వెస్ట్ ఒక అమ్మాయి నుంచే వచ్చిందనేలా నమ్మిస్తారు.



ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన టీనేజర్లు, యువకులతో చాట్ ద్వారా పరిచయం పెంచుకుంటారు. కొన్ని రోజులు చాట్ చేశాక నగ్నంగా చూడాలని ఉందని, ఫొటో పంపమని, వీడియో కాల్ చేయమని, వీడియో రికార్డ్ చేసి పంపమని.. తాము కూడా పంపుతామని వారికి పరిచయమైన యువకులతో చెబుతారు. నమ్మి ఫొటోలు, వీడియోలు పంపిన యువకులకు ఆ తర్వాత బెదిరింపులు మొదలవుతాయి. ఆ ఫొటోలను, వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ తరహా ఘటనలపై FBIకి ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ Sextortion కారణంగా బాధితులయ్యామని డజన్ల కొద్దీ యువకులు ఫిర్యాదు చేసినట్లు FBI Agency పేర్కొంది. తాను చేసిన తప్పుకు కుటుంబం ఇబ్బందుల పాలు కాకూడదని ఇలా మోసపోయిన కొందరు టీనేజర్లు తమలో తాము కుమిలిపోతూ ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. ఈ తరహా మోసాల పట్ల టీనేజర్లు అప్రమత్తంగా ఉండాలని, అమ్మాయి అడుగుతోందనే భ్రమలో నగ్న ఫొటోలను, వీడియోలను పంపి ఇక్కట్లు కొని తెచ్చుకోవద్దని FBI ఏజెన్సీ యువకులను, టీనేజర్లను హెచ్చరించింది.

Read more