ఫారెస్ట్ ఇన్ స్టిట్యూట్ లో అగ్రికల్చర్,ఫారెస్ట్రీ కోర్సులపై రోడ్ షో

ABN , First Publish Date - 2022-06-26T00:12:08+05:30 IST

తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, (FCRI), ములుగు సెంచూరియన్ విశ్వవిద్యాలయం, సహకారంతో "ది ఫ్యూచర్ నెక్సస్-అగ్రికల్చర్ & ఫారెస్ట్రీ 4.0"పై శనివారం FCRIలో రోడ్‌షోను నిర్వహించారు

ఫారెస్ట్ ఇన్ స్టిట్యూట్ లో అగ్రికల్చర్,ఫారెస్ట్రీ కోర్సులపై రోడ్ షో

హైదరాబాద్: తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, (FCRI), ములుగు సెంచూరియన్ విశ్వవిద్యాలయం, సహకారంతో "ది ఫ్యూచర్ నెక్సస్-అగ్రికల్చర్ & ఫారెస్ట్రీ 4.0"పై శనివారం  FCRIలో రోడ్‌షోను నిర్వహించారు.స్కూలు, కాలేజీ విద్యార్థులు, సమీపంలోని గ్రామాలు,పట్టణాల ప్రజలు, వివిధ నైపుణ్యాలు, డొమైన్ కోర్సులను విద్యార్థులకు అందించడంతో పాటు హైడ్రోఫోనిక్స్, బయో-ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫార్మింగ్, రిమోట్ సెన్సింగ్ వంటి శిక్షణ, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను పరిచయం చేయడానికి ఈ రోడ్‌షో నిర్వహించారు.GIS, హై-టెక్ సర్వేయింగ్, గేమింగ్ & ఇమ్మర్సివ్ లెర్నింగ్ (XR) మరియు కొత్త  టెక్నాలజీపై నిపుణులు విద్యార్థులకు అవగాహన  కల్పించారు.


మొబైల్ “ఎక్స్‌ పీరియన్స్ ఆన్ వీల్స్” -ఇమ్మర్సివ్ ఎక్స్‌ టెన్షన్ కోసం ఈ సెక్టార్‌లో AR/VR అప్లికేషన్‌లను ప్రదర్శించడం కూడా ఈ ప్రదర్శన లో విద్యార్థులకు పరిచయం చేశారు.బెంగళూరులోని సున్మోక్ష పవర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అతుల్ బిహారీ భట్నాగర్ గ్రీన్ టెక్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సుస్థిరమైన అభివృద్ధిపై సెషన్ ఇచ్చారు.ఆక్వాప్రెన్యూర్, స్మార్ట్ నానోగ్రిడ్, స్మార్ట్ మార్కెటింగ్ గురించి వివరించారు.


వ్యవసాయం, అటవీ రంగాల్లో ఉపయోగంపై సెంచూరియన్ ఫ్యాకల్టీ ద్వారా డ్రోన్ ప్రత్యక్ష ప్రదర్శన జరిగింది.ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలంటూ యువకులను ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రయత్నించాలని FCRI డీన్  ప్రియాంక వర్గీస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ IAS బి పి ఆచార్య కూడా పాల్గొన్నారు. హార్టికల్చర్ కళాశాలకు చెందిన 500 మంది విద్యార్థులు, రాజేంద్ర నగర్, గజ్వేల్ మరియు సిద్దిపేట TMREIS మరియు FCRI విద్యార్థులు రోడ్‌షోను విజయవంతం చేశారు.

Updated Date - 2022-06-26T00:12:08+05:30 IST