భయం భయం

ABN , First Publish Date - 2021-04-18T04:36:01+05:30 IST

జిల్లాలో రోజురోజుకూ కరోనా వైరస్‌ ప్రభావం పెరిగిపో తుండడంతో పాటు మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరి గిపోతోంది. నిత్యం జిల్లాలోని ఏదో ఒక్క మండలంలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

భయం భయం

జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మరణాల సంఖ్య
తాజాగా జిల్లాలో నలుగురి మృతి       
రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి
తాజాగా రికార్డుస్థాయిలో 915 మందికి పాజిటివ్‌ నిర్ధారణ
గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు
ప్రజల్లోనూ కరోనా పట్ల అంతులేని నిర్లక్ష్యం

కామారెడ్డి(ఆంధ్రజ్యోతి), కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 17: జిల్లాలో రోజురోజుకూ కరోనా వైరస్‌ ప్రభావం పెరిగిపో తుండడంతో పాటు మరణాల సంఖ్య అదే స్థాయిలో పెరి గిపోతోంది. నిత్యం జిల్లాలోని ఏదో ఒక్క మండలంలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఫస్ట్‌వేవ్‌ కరోనా ప్రభావం కంటే సెకండ్‌వేవ్‌లో లక్షణాలు కనిపించకుండా నే కరోనా పాజిటివ్‌గా రావడంతో పాటు మరణాలు తీవ్ర ంగా ఉండడంతో ప్రజల్లో భయం నెలకొంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు కరోనా వైరస్‌ బారిన పడిన రోజుల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోవడం పలు చోట్ల యువకులు వైరస్‌ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. బీర్కూర్‌, జుక్కల్‌ ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజుకు 3 నుంచి 5 మరణా లు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. తాజాగా జిల్లాలో రికార్డు స్థాయిలో 915 మంది వైరస్‌ బారిన పడగా శనివారం ఒక్కరోజే పిట్లం మండల ంలో ఒకరు, బీర్కూర్‌లో ఒకరు, కామారెడ్డిలో ఒకరు, దోమకొండలో ఒకరు మరణించారు. అయితే వీరంతా 55 సంవత్సరాలకు పైబడిన వారే కావడం గమనార్హం.
రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు
మహమ్మారి కరోనా వైరస్‌ జిల్లా వాసులను వదలడం లేదు. ప్రతీరోజు 700లకు పైగానే కేసులు నమోదవుతు న్నాయి. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో 915 మంది కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో కామారెడ్డి 64, బాన్సువాడ 62, ఎల్లారెడ్డి 29, దోమకొండ 41, మద్నూర్‌ 20, పిట్లం 50, బిచ్కుంద 21, గాంధారి 6, అన్నారం 18, భిక్కనూరు 24, బీబీపేట 20, ఎర్రాపహాడ్‌ 40, రామారెడ్డి 8, మాచారెడ్డి 14, రాజంపేట 35, ఎస్‌ఎస్‌ నగర్‌ 15, రాజీవ్‌నగర్‌ 69, దేవునిపల్లి 84, నాగిరెడ్డిపేట 24, మత్తమాల్‌ 13, లింగంపేట 12, ఉత్తూనూర్‌ 50, బీర్కూర్‌ 70, డోంగ్లీ 6, హన్మాజీపేట 16, నిజాంసాగర్‌ 13, జుక్కల్‌ 8, పుల్కల్‌ 6, పెద్దకొడప్‌గల్‌ 8 కేసులు నమోదయ్యాయి. బాన్సువాడ పరిధిలో చేసిన ఆర్‌టీపీసీ ఆర్‌ పరీక్షల్లో 69 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటి తో పాటు మరణాలు పిట్లం మండలంలో ఒకరు, బీర్కూ ర్‌లో ఒకరు, కామారెడ్డిలో ఒకరు, దోమకొండలో ఒకరు  మరణించారు. ఈ లెక్కన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు లు వైరస్‌ బారిన పడితే ప్రాణాపాయస్థితి నుంచి బయ టపడడం కష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో గతవారం రోజు ల నుంచి 3 నుంచి 5 మరణాలు సంభవిస్తుండడం అం దులోనూ ఎక్కువగా జిల్లా కేంద్రం, బీర్కూర్‌ ప్రాంతాల్లో నే ఎక్కువగా సంభవిస్తుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళ న నెలకొంటుంది.
టెస్టులకే పరిమితమైన యంత్రాంగం
జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగానే విస్తరిస్తోంది. గత ఏడాది కిందట ఇదే సమయంలో లాక్‌డౌన్‌ కొనసాగడం జన సంచారం ఎక్కువగా లేకున్నప్పటికీ కేసులు నమోద వుతునే వచ్చాయి. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ లేకపోవడం అన్ని మార్కెట్‌లు తెరిచే ఉండడం జనసంచారం సైతం పెరగడంతో వైరస్‌ విస్తరణపై ఆందోళన నెలకొంటుంది. వైరస్‌బారిన చాలామందే పడుతున్నారు. గత నెల రోజు ల నుంచి కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం టెస్టులు చేసి సదరు వ్యక్తిని మందులు వాడాల ని సూచిస్తున్నారే తప్ప గతంలో మాదిరిగా పర్యవేక్షణ చేయడం క్వారంటైన్‌ ముగిసే వరకు బయటకు రాకుం డా చర్యలు తీసుకోవడం చేయకపోవడంతో తనకు అవ సరమైన వస్తువును తెచ్చుకునేందుకు బయటకు రావ డంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించేలా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పాజిటివ్‌ వచ్చి న వారు క్వారంటైన్‌ నుంచి బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటేనే కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జిల్లా వాసుల్లోనూ కరోనా పట్ల నిర్లక్ష్యం
జిల్లాలో గత నెల నుంచి కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నప్పటికీ జిల్లా వాసుల్లో మాత్రం వైరస్‌ పట్ల నిర్లక్ష్యం వీడడం లేదు. కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు. విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా సంచరి ంచడం షాపింగ్‌మాల్‌లు, వాణిజ్య వ్యాపార దుకాణాలు, థియేటర్లు, బార్‌లు, వైన్స్‌ల వద్ద మాస్కులు ధరించకుం డానే గుమి గూడుతున్నారు. చాలా మంది ప్రజలు కనీ సం మాస్కులు కూడా ధరించకుండానే రోడ్లపై సంచరి స్తున్నారు. మాస్క్‌లు లేకుండా బయటకు వెళ్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా ప్రజల్లో భయం నెలకొనడం లేదని భావన వినిపిస్తోంది. గత సంవత్సరం కిందట కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రతి ఒక్క రూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఒక్కటికి రెండు సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవడం లాంటివి చేశారు. ప్రస్తుతం వీటిని ప్రజలు పాటించడం లేదని ఇప్పటికే వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో చేతులె త్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజల్లో మార్పు వస్తేనే కరోనాను అందరు కలిసి కట్టడి చేయవచ్చని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-04-18T04:36:01+05:30 IST