కలుషిత నీరు తాగాలంటే భయం..భయం

ABN , First Publish Date - 2022-05-16T05:29:16+05:30 IST

కలుషితమవుతున్న నీటిని తాగాలం టే భయమేస్తోందని నగరం లోని పలు ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.

కలుషిత నీరు తాగాలంటే భయం..భయం
పాత బస్టాండ్‌ ప్రాంతంలో పైప్‌లైన దెబ్బతిని లీకవుతున్న తాగునీరు

కడప(ఎర్రముక్కపల్లి),మే15: కలుషితమవుతున్న నీటిని తాగాలం టే భయమేస్తోందని నగరం లోని పలు ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి పాత పైపులే ఉం డటంతో నీటి ఒత్తిడి కొంత పెరుగుతుండటంతో అవి లీకేజీ అవుతున్నాయి. పదిరోజుల నుంచి లీకే జీ అవుతున్నా నగరపాలక నీటి సరఫరా విభాగం పట్టించుకోవడం లేదు. కలుషితనీరు తాగలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కడప నగరం పరిధిలోని పాత బస్టాండ్‌, రవీంద్రనరగ్‌, మారుతీనగర్‌, రామరాజుపల్లి, ఆర్కేనగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన లీకేజీ కావడంతో దుర్గంధంతో కూడిన రంగుమారిన నీరు వస్తోంది. ప్రజలు ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం. అధికారులు స్పందించి లీ కులను అరికట్టి మంచి నీటిని సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. 


వెంటనే పరిష్కరిస్తాం: ఇనచార్జి డీఈ

ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైప్‌లైన లీకేజీలను మరమ్మతులు చేశామని తాగునీటి సరఫరా విభా గం ఇనచార్జ్‌ డీఈ కరీముల్లా పేర్కొన్నారు. పాత పైప్‌లైను కావడంతో అడ పాదడపా సమస్య ఏర్పడుతోందన్నారు. చాలా చోట్ల బ్రిటీష్‌ కాలంలో వేసిన పైపులైన్లే ఉన్నాయని, అవి కూడా భూమి లోపలే ఉన్నాయన్నారు. వాటిని గుర్తించడంలో కొంత ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. రవీంద్రనగర్‌ ప్రాంతంలో సమస్యను పరిష్కరించగలిగాంమని, మారుతీనగర్‌లో సరి చేసేందుకు  ప్ర యత్నిస్తున్నామన్నారు. త్వరలో కలుషిత నీరు రాకుండా అన్ని చర్యలు చేపడతాం. 

Updated Date - 2022-05-16T05:29:16+05:30 IST