వివాహ అర్హత వయసు పెంపు ప్రతిపాదనతో ఊపందుకున్న పెళ్లిళ్లు

ABN , First Publish Date - 2021-12-21T16:25:36+05:30 IST

మహిళల వివాహ అర్హత వయసును 18 సంవత్సరాల

వివాహ అర్హత వయసు పెంపు ప్రతిపాదనతో ఊపందుకున్న పెళ్లిళ్లు

చండీగఢ్ : మహిళల వివాహ అర్హత వయసును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో హర్యానాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు తమ కుమార్తెలకు ఆత్రుతగా పెళ్లిళ్లు చేస్తున్నారు. మేవాత్ ప్రాంతంలో ఈ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న బాలికలకు త్వరగా పెళ్లిళ్లు చేసేందుకు వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. 


హర్యానాలోని మేవాత్, రోహ్‌తక్, జింద్, హిసార్, తదితర ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం అమల్లోకి రావడానికి ముందే తమ కుమార్తెలకు వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఇటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సంప్రదాయాలను పాటించే సంపన్న కుటుంబాలు కూడా తమ కుమార్తెల వివాహాల కోసం  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మేవాత్ ప్రాంతంలో గడచిన రెండు రోజుల్లో 500 పెళ్లిళ్లు జరిగాయి. ఈ పెళ్లిళ్ళలో వధువుల వయసు 18-20 సంవత్సరాలు ఉంటుంది. వీరి స్నేహితురాళ్ళపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ‘‘అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి, మీరు కూడా పెళ్లి చేసుకోండ’’ని అమ్మాయిల తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నట్లు ఓ విద్యార్థిని తెలిపారు. ఇదే సమయంలో కులాంతర వివాహాలు కూడా ఊపందుకున్నాయి. గడచిన వారంలో 20 కులాంతర వివాహాలు జరిగాయి. 


Updated Date - 2021-12-21T16:25:36+05:30 IST