Viral Video: పెళ్లివేడుకలో అగ్నిప్రమాదం.. అదే సమయంలో వీరు చేసిన పనికి నెటిజన్ల నుంచి వెరైటీ రియాక్షన్స్

Nov 29 2021 @ 16:56PM

రోమ్ నగరం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. ఈ సామెత నిజమో కాదో తెలియదు కాదు కానీ.. మహారాష్ట్రలోని థానేలో మాత్రం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల కల్యాణ మండపం మొత్తం కాలిపోతుంటే.. ఆ పక్కనే కూర్చుని విందు భోజనం చేశారు కొందరు వ్యక్తులు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 మహారాష్ట్రలోని థానేలో అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం సాయంత్రం ఓ పెళ్లి వేడుక జరిగింది. అగ్ని ప్రమాదం వల్ల రాత్రి 8 గంటల సమయంలో కల్యాణ మండపంలో భారీగా మంటలు లేచాయి. అతి కష్టం మీద వరుడిని, వధువును కాపాడారు. అందరూ అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం అదే సమయంలో విందు భోజనం అరగించారు. వెనకాల పెద్ద ఎత్తున మంటలు లేచినప్పటికీ వారు చలించుకుండా జిహ్వ చాపల్యం తీర్చుకున్నారు. ఆ ఘటనను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వారి చర్యపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.