ఫీచర్‌ ఫోన్లతోనూ చెల్లింపులు

ABN , First Publish Date - 2022-01-05T05:47:42+05:30 IST

కాలంతో పాటే ఆర్థిక లావాదేవీల స్వరూ పం మారిపోతోంది. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, వాలెట్‌ ఉంటే చాలు. ...

ఫీచర్‌ ఫోన్లతోనూ చెల్లింపులు

 నెట్‌ లేకున్నా ధీమాగా లావాదేవీలు

కాలంతో పాటే ఆర్థిక లావాదేవీల స్వరూ పం మారిపోతోంది. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, వాలెట్‌ ఉంటే చాలు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండానే ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఆఫ్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి ఆర్‌బీఐ సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలు దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని మరింత పెంచబోతున్నాయి. కాకపోతే ఒక్కో లావాదేవీ చెల్లింపునకు రూ.200, మొత్తం చెల్లింపుల గరిష్ఠ పరిమితి రూ.2,000 మించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 


ఆఫ్‌లైన్‌ చెల్లింపులంటే ?

నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్‌ ఫోన్‌, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు, వాలెట్‌ ఉంటే చాలు. వెంటనే  మనం కొనే వస్తు, సేవలకు చెల్లింపులు చేయవచ్చు. నెట్‌ కనెక్టివిటీ లేని మామూలు ఫీచ ర్‌ ఫోన్‌ ఉన్నా ఈ చెల్లింపులకు ఢోకా ఉండదు. కొద్దిగా ఆలస్యమైనా ఆ చెల్లింపుల వివరాలు ఎస్‌ఎంఎస్‌ లేదా ఇమెయిల్‌ రూపంలో ఖాతాదారులకు చేరతాయి. గ్రామీణ, చిన్న చిన్న పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఈ ఆఫ్‌లైన్‌ చెల్లింపులు ఎంతగానో ఉపయోగపడతాయి. 


చెల్లింపులకు భద్రత : ఇలాంటి ఆఫ్‌లైన్‌ చెల్లింపుల భద్రతకూ ఢోకా ఉండదు. ఖాతాదారుల అనుమతితోనే ఈ చెల్లింపులు జరుగుతాయి. పైగా ఈ చెల్లింపులు ఫేస్‌ టు ఫేస్‌ పద్దతిలో దగ్గరుండి (ప్రాక్సిమిటీ మోడ్‌) మరీ ఈ చెల్లింపులు చేయాలి. దీంతో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-05T05:47:42+05:30 IST