ఫెడరల్ బ్యాంక్... నికరలాభం రూ. 522 కోట్లు...

Published: Wed, 26 Jan 2022 17:04:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫెడరల్ బ్యాంక్... నికరలాభం రూ. 522 కోట్లు...

హైదరాబాద్ : వార్షిక ప్రాతిపదికన ఫెడరల్ బ్యాంక్ నికర లాభం రూ. 522 కోట్లు, నిర్వహణ లాభం 4.4% తగ్గి, రూ. 914 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ త్రైమాసికంలో ఏడు బేసిస్ పాయింట్లు మెరుగుపడి 3.27 % కు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం క్రితం సంవత్సరంతో పోలిస్తే 7 % పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు ఏడాది క్రితమున్న 2.71 %, సెప్టెంబరు త్రైమాసికంలోని 3.24 %తో పోలిస్తే డిసెంబరు త్రైమాసికంలో 3.06 % వద్ద ఉన్నాయి. అంటే వార్షిక ప్రాతిపదికన పెరిగినప్పటికీ, త్రైమాసికంలో మాత్రం తగ్గాయి. కేటాయింపులు ఏడాది క్రితం కాలంలోని రూ. 414 కోట్లతో పోలిస్తే, ఇప్పుడు రూ. 214 కోట్లకు తగ్గాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.