అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-28T05:28:52+05:30 IST

ఒక వైపు వర్షాలు... మరోవైపు నల్ల తామర పురుగు వైరస్‌ల ఉధృతి నేపథ్యంలో అన్నదాతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు. శనివారం పర్చూరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించిన ఆయన పర్చూరు, యద్దనపూడి, మండలాల్లో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పైర్లను పరిశీలించారు. ఇటీవల కాలంలో వైరస్‌ ఉధృతి నేపఽథంలో మిర్చి పైర్లును పరిశీలించి రైతులకు సూచనలు చేశారు.

అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి
ఉప్పుటూరులో రైతులకు సూచనలు ఇస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

 - భారీ వర్షాలతో పైర్లు నష్టం

-  ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి

- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పర్చూరు, నవంబరు 27 ఒక వైపు వర్షాలు... మరోవైపు నల్ల తామర పురుగు వైరస్‌ల ఉధృతి నేపథ్యంలో అన్నదాతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని కోరారు. శనివారం పర్చూరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించిన ఆయన పర్చూరు, యద్దనపూడి, మండలాల్లో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పైర్లను పరిశీలించారు.  ఇటీవల కాలంలో వైరస్‌ ఉధృతి నేపఽథంలో మిర్చి పైర్లును పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. 

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో మిరప, మినుము, ప్రత్తి, పొగాకు పైర్లకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. మరోవైపు నల్ల తామర పురుగు ఉధృతితో నష్టం జరిగిందన్నారు. గతంలో మిర్చి పంటలో కనిపించే ఈతరహా పురుగు ప్రస్తుతం అన్నీ పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించేందుకు పంటలను పరిశీలించాలని, ఎన్‌.జి.రంగా యూనివర్శిటీ అధికారులతోపాటు, వ్యవసాయశాఖ దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగిందన్నారు. వరుస విపత్తులతో అన్నదాతల పరిస్థితి కడు దయనీయంగా మారిందని, ప్రభుత్వం అన్నదాతలను అదుకుంటేనే వ్యవసాయం మనుగడ ఉంటుందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. భూమిని నమ్ముకొని ఉన్న రైతులకు అసరా కల్పించాల్సిన ప్రభుత్వం వరి పంట సాగుచేయవద్దని చెప్పడం దారుణంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని పోత్సహించాల్సిన ప్రభుత్వమే క్రాప్‌క్షక్షహాలిడే తీసుకోవాలని చెప్పటం భాద్యతా రాహిత్యమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారంతోపాటు, విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.


మిర్చి పైరు పరిశీలన

యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో వర్షాలకు దెబ్బతిన్న మిరప పైరును శనివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. ఇప్పటికే ఎకరాకు లక్ష రూపాయల వరకు నష్టపోయామని రైతులు పేర్కొన్నారు. ఆయన వెంట గుదే తారక రామారావు, పలువురు నాయకులు ఉన్నారు. అనంతరం మార్టూరు మండలంలో కోనంకి గ్రామంలో మృతిచెందిన ఉప్పలపాటి రంగనాయకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఏలూరి నివాళులర్పించారు.


Updated Date - 2021-11-28T05:28:52+05:30 IST