బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిందనే కోపంతో సోదరిని కాల్చి చంపిన సోదరుడు

ABN , First Publish Date - 2021-06-22T18:00:58+05:30 IST

తన సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిందనే కోపంతో పరువు కోసం ఆమెను కాల్చి చంపిన సోదరుడి బాగోతం....

బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిందనే కోపంతో సోదరిని కాల్చి చంపిన సోదరుడు

మీరట్ (ఉత్తరప్రదేశ్): తన సోదరి బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయిందనే కోపంతో పరువు కోసం ఆమెను కాల్చి చంపిన సోదరుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సర్దన పోలీసుస్టేషన్ పరిధిలోని చుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అంజలి అనే 16 ఏళ్ల బాలిక తన ప్రియుడైన గౌరవ్ తో కలిి పారిపోయింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తిరిగి ఇంటికి రావడంతో ఆమె కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడితో పారిపోయి తిరిగివచ్చిన అంజలి ఇంట్లో పనిచేస్తుండగా ఆమె సోదరుడు శేఖర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం శేఖర్ ఇంటి నుంచి పారిపోయాడు. అంజలి గౌరవ్ ను వివాహం చేసుకోవాలని అనుకున్నా, వీరి బంధానికి సోదరుడు అడ్డుగా నిలిచాడు. బాలిక మామ ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-06-22T18:00:58+05:30 IST