Xiaomi: చైనీస్ మొబైల్ దిగ్గజం షావోమీకి కోలుకోలేని షాక్.. రూ. 5,551 కోట్ల సీజ్

ABN , First Publish Date - 2022-10-01T02:15:34+05:30 IST

చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ(Xiaomi)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించిందంటూ

Xiaomi: చైనీస్ మొబైల్ దిగ్గజం షావోమీకి కోలుకోలేని షాక్.. రూ. 5,551 కోట్ల సీజ్

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ(Xiaomi)కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇప్పటికే షావోమీ(Xiaomi)పై కేసు నమోదు చేసిన ఈడీ(ED) ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5,551.27 కోట్లను సీజ్ చేసింది. తాజాగా ఈ సీజింగ్ ఆర్డర్‌ను కాంపిటెంట్ అథారిటీ శుక్రవారం ధ్రువీకరించింది. దేశంలో ఇప్పటికి వరకు సీజ్ చేసిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం. సీజ్ చేసిన మొత్తానికి సమానమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇండియా నుంచి అనధికారిక పద్ధతిలో భారత్ నుంచి బదిలీ చేసినందున ఈ మొత్తాన్ని సీజ్ చేయడం సరైన నిర్ణయమేనని కాంపిటెంట్ అథారిటీ స్పష్టం చేసింది. రాయల్టీ చెల్లింపు అనేది భారత్ నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని బదిలీ చేసే సాధనం తప్ప మరోటి కాదని, అదే సమయంలో ఫెమా నిబంధనలను షావోమీ దారుణంగా ఉల్లంఘించినట్టు కాంపెటెంట్ అథారిటీ గుర్తించింది.


విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం 1999 (Foreign Exchange Management Act,1999) కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అధికారులు షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌(Xiaomi Technology India Private Limited)కు చెందిన రూ. 5,551.27 కోట్లను సీజ్ చేసింది. 2014లో షావోమీ((Xiaomi)) స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించగా, 2015 నుంచి డబ్బులు పంపడం ప్రారంభించింది. ఈ సొమ్మును షావోమీ గ్రూప్((Xiaomi Group) సహా మూడు విదేశీ కంపెనీలకు రాయల్టీ పేమెంట్స్ కింద చెల్లించింది. షావోమీ(Xiaomi) పేరెంట్ గ్రూప్ సంస్థల సూచనలతోనే రాయల్టీ పేరుతో ఇంతటి భారీ మొత్తాలను పంపించారు. అంతేకాదు, షావోమీ గ్రూప్ సంస్థల ప్రయోజనం కోసం అమెరికాకు చెందిన సంబంధం లేని రెండు సంస్థలకు కూడా డబ్బు పంపినట్టు ఈడీ గుర్తించింది.


షావోమీ ఇండియా అనేది చైనాకు చెందిన షావోమీ గ్రూప్‌ అనుబంధ సంస్థ. ఈడీ ఆదేశాలను షావోమీ కర్ణాటక హైకోర్టులో సవాలు చేసింది. అయితే, ఆ రిట్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు.. ఈడీతో వివాదానికి సంబంధించి కాంపిటెంట్ అథారిటీని సంప్రదించాలని ఆదేశించింది. 

Updated Date - 2022-10-01T02:15:34+05:30 IST